వాలెంటైన్స్ డే రోజు డేటింగ్‌తో పాటు ఇంకా ఏమైనా చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే, ఇవి పాటించండి. తప్పకుండా మీ డేట్ జీవితంలో మరపురాని గుర్తుగా మిగిలిపోతుంది.
డేటింగ్ అంటే ఏమిటి?
డేటింగ్ అంటే ఆధునిక తరంలో పుట్టుకొచ్చిన ఒక కొత్త ప్రేమ ప్రక్రియ. ఒకరితో ఒకరు జీవితం పంచుకోనాలన్న వ్యక్తులు పెళ్లికి ముందే కొన్ని రోజులు పాటు డేటింగ్ లా ఉంటారు. ఆ సమయంలో కలిసి తినడం, కలిసి తిరగడం అన్ని విషయాలను షేర్ చేసుకోవడం వంటిది కూడా జరుగుతాయి. పాశ్చాత్య సంస్కృతిలో శృంగార ప్రక్రియలు కూడా డేటింగ్‌లో భాగమే ఇలా అన్ని విషయాల్లోనూ ఒకరికొకరు నచ్చితేనే పెళ్లితో ఒక్కటవుతారు. లేకపోతే అక్షరమే బంధాన్ని తెంపుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు.
❤ వాలెంటైన్స్ డే రోజే డేటింగ్‌ను మొదలుపెట్టే వారి సంఖ్య ఎక్కువే. డేటింగ్ అనేది సన్నిహిత సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగే ఒక ప్రక్రియకు సంబంధం కూడా కావచ్చు లేదా కాకపోనూవచ్చు. అది ఆ ఇద్దరి వ్యక్తుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. తొలిసారి డేటింగ్‌కి వెళ్ళినప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పనులు చేయకుండా ఉండాలి.
❤ డేటింగ్‌కి వెళ్తున్న జంటలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఏ ప్లేస్ కి వెళ్లాలో ముందే నిర్ణయించుకుంటారు. అందమైన దుస్తులు మేకప్‌లు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. అలాగే డేటింగ్ లో ఎలాంటి ప్రశ్నలు అడగాలి? ఎలా ఉండాలి? వంటలు కూడా ఆలోచించుకునే వెళ్తారు.
❤ కొందరు డేటింగ్ పేరుతోనే శారీరకంగా దగ్గరయ్యేందుకు కూడా సిద్దమవుతారు. ఏదేమైనా ఫస్ట్ డేట్ అనేది చాలా ముఖ్యమైనది. అది మీ వ్యవహారశైలి పైనే ఆధారపడి ఉంటుంది. మీ శైలి వారికి నచ్చితే వారి జీవితాంతం నీతోనే ఉంటారు.
❤ డేటింగ్‌లో మీ కుటుంబ గురించి, ఎదుటి కుటుంబం గురించి కచ్చితంగా తెలుసుకోండి. అవేవీ తెలుసుకోకుండా ముందుకు వెళ్ళకండి. అలాగే కెరీర్ గురించి కూడా ప్రశ్నలు అడగండి. ఎలాంటి ఉద్యోగాలు ఇష్టం వంటివి కనుక్కోండి. అలాగే ఇంట్లోనే కట్టుబాట్లు గురించి కూడా అడగండి. మానసికంగా ఒకరికి ఒకరు నచ్చాకే శారీరక అనుబంధం వరకు వెళ్లాలి.
❤ ఒకరితో ఒకరు అర్థవంతమైన, భావోద్వేగ సంబంధాన్ని కొనసాగించాలి. ఎవరైతే భావోద్వేగాలపరంగా ఒకటిగా మారుతారు. వారు జీవితాంతం సుఖంగా ఉంటారు.
❤ ఫస్ట్ డేటింగ్ లో ఏదైనా కూడా బహిరంగంగా నిజాయితీగా మాట్లాడండి. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీ అవసరాలు, భయాలు, కోరికలు అన్నింటినీ చెప్పడం వల్ల ఎదుటివారు మీ విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని కచ్చితంగా తీసుకుంటారు. గుప్పెట్లో మూసి మాట్లాడటం వల్ల ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు.
❤ అనుబంధాలలో ఎదురయ్యే సమస్యల గురించి కూడా ముందుగానే మాట్లాడుకోండి. ముందుగా మైనస్‌లు గురించి మాట్లాడకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు. ఒకరికి అలవాట్లు మరొకరికి తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ఆసక్తులు కూడా ఒకరికొకరు పంచుకోవాలి.
❤ శరీరక సంబంధాల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కోరికలు ఎక్కువగా ఉన్న వ్యక్తిని జీవితంలో అధికం చేయడం కష్టమవుతుంది. వారికి శారీరక బంధాలపైనే తప్ప వ్యక్తులపై ఆసక్తి ఉండదు. కాబట్టి అర్థవంతమైన సంతృప్తికరమైన సంబంధం గురించి ఇద్దరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
❤ మీ భాగస్వామి అందరి ముందు మీతో ఆనందంగా గడుపుతూ మీ ఒంటరిగా ఉన్నప్పుడు నాణ్యమైన గడప లేదంటే అది ఇద్దరి మధ్య శారీరక కలయికను దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రేమకు లైంగిక అనుబంధం కూడా ఎంతో ముఖ్యం. ఆ విషయంలో కూడా ఇద్దరు మనసుపెట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏకాంతంగా కలుసుకోడానికి హోటల్ రూమ్స్ అస్సలు సురక్షితం కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి.
Also Read: వాలంటైన్స్ డే ఆ రోజు ఆ రిస్క్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలియకపోతే రస్కులు తింటూ కూర్చోవల్సిందే!