BigTV English

Gold Facial: బ్యూటీ పార్లర్‌తో అవసరం లేకుండా.. ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్..

Gold Facial: బ్యూటీ పార్లర్‌తో అవసరం లేకుండా.. ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్..

Gold Facial At Home: ఈ వేసవిలో వచ్చే ఎండ తీవ్రత వల్ల.. చర్మం నిర్జీవంగా, నల్లగా మారే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ లోపం వల్ల అలసటగా, ఫేస్ డల్‌గా కనిపిస్తుంటుంది. ఇందుకోసం ఫేసియల్స్ లేదా క్లీనప్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే వేలకు వేలు ఖర్చు చేసి బ్యూటీ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే నాచురల్‌గా గోల్డ్ ఫేసియల్స్ తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


స్టెప్-1 క్లీనింగ్
పచ్చిపాలు చిన్న గిన్నెలోకి తీసుకుని.. అందులో కాటన్ క్లాత్ ముంచి ముఖంపై మసాజ్ చేయండి. ఇలా చేస్తే ఫేస్‌పై మురికి తొలగిపోతుంది. ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

స్టెప్ -2 స్క్రబ్బింగ్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో టీ స్పూన్ షుగర్, టీ స్పూన్ హని, రెండు టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.


స్టెప్-3 స్టీమింగ్(ఆవిరి)
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని.. అందులో వాటర్ పోసి కొద్దిసేపటి వరకు మరిగించండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి 10 నిమిషాలు ఆవిరి పట్టండి.

స్టెప్-4 ఫేస్ మాస్క్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని.. అందులో కొబ్బరి నూనె రెండు టేబుల్ స్పూన్లు, హని లేదా పసుపు రెండు టీ స్పూన్, నిమ్మరసం లేదా పెరుగు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి.

ఇలా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు.. పైన చెప్పిన విధంగా పాటిస్తే.. సరిపోతుంది. గోల్డ్ ఫేషియల్ రెడీ అయినట్లే.. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు కూడా తగ్గిపోయి.. యవ్వనంగా కనిపిస్తారు.

మఖం కాంతివంతంగా అందంగా మెరిసేందుకు మరిన్ని చిట్కాలు.. 

బియ్యంపిండి, పచ్చిపాలు, తేనె, అలోవెరాజెల్ ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ బియ్యంపిండి, పచ్చిపాలు, తేనె, అలోవెరాజెల్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి.

పసుపు, శెనగపిండి, పెరుగు, కొబ్బరి నూనె ఫేస్ మాస్క్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ శెనగపిండి, టీ స్పూన్ పెరుగు, టీ స్పూన్ కొబ్బరి నూనె కలిపి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి.. మంచి ఫలితం ఉంటుంది. గోల్డ్ ఫేసియల్ చేసుకున్నంత మెరుపు వస్తుంది. ముఖం కాంతివంతంగా, తాజాగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

Also Read: కుంకుమపువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారా?

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

 

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×