Intinti Ramayanam Today Episode April 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఆరాధ్య నువ్వు రెడీ చేసి స్కూల్ కి తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ పల్లవి నేను నీకోసం క్యారేజ్ తెచ్చాను అంటే ఆరాధ్య నాకు అవసరం లేదంటుంది. కానీ పల్లవి మాత్రం ఆరాధ్య అలానే అంటుంది మీరు తీసుకెళ్లండి బావగారు అని అంటుంది. ఇక ఆరాధ్యడు నేను స్కూలుకు తీసుకెళ్తానని పల్లవి అడుగుతుంది కానీ నేనే స్కూల్ కి తీసుకెళ్తానని అక్షయ్ అంటాడు. పల్లవి అవని నుంచి ఆరాధ్యను తన వైపు తిప్పుకుంటే అవని ఇంట్లో అడుగుపెట్టదు అని అనుకుంటుంది. పార్వతి ఆరాధ్య అవని కోసం ఇంకా బాధపడుతుంది ఎలాగైనా నా మనవరాలుని నేను దక్కించుకోవాలని అనుకుంటుంది. దానికి పల్లవి మీరేం కంగారు పడకండి అత్తయ్య ఆరాధ్యను ఆవని తీసుకుపోకుండా నేను చూసుకుంటాను అని అంటుంది. హాస్పిటల్ లో రాజేంద్రప్రసాద్ ప్రణతిని చూస్తాడు. మొత్తం నిజాన్ని తెలుసుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..ప్రణతి ఆ స్థితిలో చూసి ఎమోషనల్ అవుతాడు. అక్కడే ఉన్న భరత్ ని ప్రణితికి ఏమైందని అడుగుతాడు. చిన్న యాక్సిడెంట్ వల్ల ప్రణతి కడుపుకి బలంగా గాయమైంది దాంతో అబార్షన్ చేయాల్సి వచ్చింది అని భరత్ చెప్తాడు. అది విన్న రాజేంద్రప్రసాద్ లోపల ప్రణతిని పరామర్శించేందుకు వెళ్తాడు.. ప్రణతి మొత్తం నిజం చెప్తుంది. అది విన్న రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అవుతాడు. అటు అక్షయ్ డబ్బులను అవని దొంగ నుంచి కాపాడుతుంది. అయితే ప్రణతికి ఆపరేషన్ కు డబ్బులు కావాలని అడిగి తీసుకుంటుంది.
రాజేంద్రప్రసాద్ హాస్పిటల్లో అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అవని రాగానే మావయ్య గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. నేను ప్రణతిని ఈ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాను అమ్మా అని అంటాడు. నిన్ను ఎన్నిసార్లు అవమానించినా కూడా నువ్వు కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాం అవని అనే పేరు నీకు అందుకే పెట్టారేమో అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. వయసులో నీకంటే పెద్దవాన్ని కాబట్టి నేను చేతులు పట్టుకొని క్షమించు అని అడగలేను. నీకే ఆయుష్ క్షణం అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
నిన్ను క్షమించమని అడగడం తప్ప మరేమీ చేయలేనమ్మ అని రాజేంద్రప్రసాద్ అవనితో అంటాడు. ప్రణతిని డిశ్చార్జ్ చేసిన తర్వాత అందరితో మాట్లాడి ఇంటికి తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్రణతి దగ్గరికి వెళ్లిన అవని మామయ్య గారికి ఎందుకిలా చెప్పావు ప్రణతి అని అనగానే నాకు ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది వదిన అని అంటుంది. నువ్వేం ఆలోచించకుండా పడుకో అంతా మంచి జరుగుతుందని అవని ప్రణతితో అంటుంది.
అక్షయ్ త్వరగా ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి అక్షయ్ నువ్వు ఆఫీస్ కి వెళ్ళలేదా ఇంత త్వరగా ఇంటికి వచ్చావు అనేసి పార్వతి అడుగుతుంది. లేదమ్మా అని మౌనంగా ఉంటాడు.. ఏమైందిరా అలా ఉన్నావ్ అంటే అవని కనిపించిందమ్మా స్కూల్లో అని అంటాడు. నువ్వు మాట్లాడవా అని పార్వతి అడుగుతుంది.. మధ్యలో కమలొచ్చి ఆ స్కూల్లో పనిచేస్తుంది కదా అందుకే వచ్చి కనిపించి ఉంటది అని అంటాడు. అటు శ్రీకర్ కూడా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మాట్లాడితే తప్పేంటి అని అంటాడు.
కానీ అక్షయ్ మాత్రం అవనీ నన్ను డబ్బులు అడిగి తీసుకునింది అని అంటాడు. ఎప్పుడు నేను డబ్బులు ఇస్తానన్నా వద్దని అవని ఈసారి అడిగి మరి ఎందుకు డబ్బులు తీసుకుందో నాకు అర్థం కావట్లేదు అని అక్షయ్ అనగానే అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేంద్రప్రసాద్ నీ దగ్గర డబ్బులు తీసుకునింది తన సొంత ప్రయోజనాల కోసం కాదు నీ చెల్లెలు ప్రాణాలు కాపాడటానికి అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
చెల్లెలు ప్రాణాలు ఏంటి నాన్న ఏమైంది ప్రణతికి అని అందరూ అడుగుతారు. ప్రణతికి అబార్షన్ అయింది. తనకు సడన్గా యాక్సిడెంట్ అవడంతో చనిపోవాలని అనుకుంది. తాను చేసిన తప్పుని తెలుసుకొని అందరికీ దూరం అవ్వాలని ప్రణతి అనుకుంది. మళ్లీ అవని ప్రణతిని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది. అబార్షన్ అయిపోయిందని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయితే అందరూ అవని గురించి తెలుసుకొని బాధపడతారు. అందరూ కలిసి ప్రణతిని చూద్దామని అంటారు.. రాజేంద్రప్రసాద్ నీకు ఫోన్ చేసి ప్రణతి ఆరోగ్యం ఎలా ఉందో నేను కనుక్కుంటానని అంటారు.
ప్రణతిని డిశ్చార్జ్ చేశారని అవని రాజేంద్రప్రసాద్ కి చెప్తుంది. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ రాజేంద్రప్రసాద్ చెప్తాడు.. ప్రణతిని మన ఇంటికి తీసుకొద్దామండి అని పార్వతి అంటుంది. అవని ప్రణతిని మనకన్నా బాగా చూసుకుంటుంది అని అవని గురించి గొప్పగా చెప్తాడు రాజేంద్రప్రసాద్. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..