BigTV English

Pulse Polio 2024 : తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. నేడే పల్స్ పోలియో!

Pulse Polio 2024 : తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. నేడే పల్స్ పోలియో!

Pulse Polio


Pulse Polio Drive 2024 : పిల్లల నిండు జీవితాన్ని కాపాడేందుకు ప్రతి ఏటా ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లలకు కచ్చితంగా పోలియో చుక్కలను వేయించాలని ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాయి. పోలియో రహిత దేశంగా తయారు చేసేందుకే ప్రభుత్వం ప్రతి ఏటా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రణాలికా బద్దంగా నిర్వహిస్తుంది.

ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. మార్చి 3న ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తారు. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆరోగ్య శాఖ అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు.


Read More :  పారాసిటమాల్‌ టాబ్లెట్ ఎక్కువగా వాడుతున్నారా..!

ప్రజలకు అందుబాటులో మొబైల్ బూత్‌లు కూడా ఉన్నాయి. ఇప్పటికే పోలియో వ్యాక్సిన్ అందించడానికి శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులు విధిగా పోలియో బూత్‌కు వెళ్లి పోలియో చుక్కలు వేయించాలి. ప్రయాణంలో ఉన్న కూడా పోలియో చుక్కలు వేయించుకోవచ్చు. ప్రముఖ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కూడా పోలియో కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి.

తల్లిదండ్రులకు ఎంత ముఖ్యమైన పనున్నా.. అవన్నీ పక్కనబెట్టి బాధ్యతగా తమ పిల్లలను దగ్గరలోని కేంద్రాలకు తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.  ఒకవేళ మార్చి 3న మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోతే మార్చి 4,5 తేదీల్లో గ్రామాల్లోని ఆరోగ్య సిబ్బంది ఇంటికి వచ్చి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.

Read More : జిమ్ చేసేప్పుడు ఆ లక్షణాలు.. హార్ట్ ఎటాక్ కారణం కావొచ్చు..!

పోలియో చుక్కలు వేయించకుంటే పిల్లలు అనారోగ్యం పాలవడమే కాకుండా అంగవైకల్యానికి గురవుతారు. అంతేకాకుండా నరాల బలహీనత ఏర్పడుతుంది. పోలియో వ్యాధికి టీకా తప్ప మరో పరిష్కారం లేదు. అందుకే తప్పుకుండా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి. పోలియో బారిన పడటం వల్ల పిల్లలకు మెదడుకు కూడా పాకుతుందని వైద్యులు హెచ్చరించారు.

పోలియో చుక్కలు వేయడం ద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు పిల్లలకు పోలియో చుక్కలు వేసిన తర్వాత ఒకటి లేదా రెండు రోజులపాటు కొంత ఇబ్బంది ఉంటుంది. దీని వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదని సూచిస్తున్నారు.

Tags

Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×