E-Paper
Advertisement

హోమ్ థియేటర్ కొనాలనుకుంటున్నారా? దీని కంటే బెస్ట్ ఉండదేమో!

హోమ్ థియేటర్ కొనాలనుకుంటున్నారా? దీని కంటే బెస్ట్ ఉండదేమో!
Advertisement

GOVO 320W Soundbar: ప్రస్తుత కాలంలో టీవీలో విజువల్స్ ఎంత స్పష్టంగా ఉంటున్నాయో, ఆడియో ఫీల్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే సాధారణ టీవీలతో వచ్చే ఇన్‌బిల్ట్ స్పీకర్ల ద్వారా ఆ స్థాయి సౌండ్ రాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మార్కెట్లో బెస్ట్ హోమ్ థియేటర్ సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ.. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే వాటిలో ‘గోవో గోసౌరండ్ 955 ప్రో’ముందు వరుసలో ఉంది. ప్లాటినం బ్లాక్ కలర్‌లో లభించే ఈ 320 వాట్ల సౌండ్‌బార్ ప్రస్తుత మార్కెట్లో రూ.5,499 ధరతో కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1.పవర్‌ఫుల్ 320 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్ :

ఈ సౌండ్‌బార్ మెయిన్ హైలైట్ దీని పవర్. ఇది ఏకంగా 320 వాట్ల పవర్‌ఫుల్ సౌండ్‌ను అందిస్తుంది. ఇంట్లోనే.. థియేటర్ లాంటి ఫీల్ పొందాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. పెద్ద హాల్స్ లేదా లివింగ్ రూమ్‌లలో.. కూడా సౌండ్ ఏ మాత్రం తగ్గకుండా మూల మూలకు స్పష్టంగా వినిపిస్తుంది. సినిమాలు చూసేటప్పుడు యాక్షన్ సీన్లు లేదా మ్యూజిక్ వినేటప్పుడు కూడా బీట్స్ అదిరి పోతాయి.

2.ట్రూ 5.1 ఛానెల్ సరౌండ్ సౌండ్:

Advertisement

ఇది ట్రూ 5.1 ఛానెల్ హోమ్ థియేటర్ సిస్టమ్. ఇందులో మెగా సబ్‌వూఫర్,శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఇవి రూమ్‌లో నలువైపుల నుంచి సౌండ్ వచ్చేలా చేసి త్రిడీ సరౌండ్ సౌండ్ ఫీల్ ఇస్తాయి. వెనుక వైపు నుంచి వచ్చే చిన్న సౌండ్లు కూడా స్పష్టంగా వినిపించడం దీని ప్రత్యేకత.

3.ప్రీమియం డిజైన్, లుక్ :

ప్లాటినం బ్లాక్ ఫినిషింగ్‌తో వస్తున్న ..ఈ సౌండ్‌ బార్ మీ ఇంట్లోని లివింగ్ రూమ్ అందాన్ని మరింత పెంచుతుంది. ఇది చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ.. టీవీ కింద అమర్చుకోవడానికి చక్కగా సరి పోతుంది. ముందు భాగంలో ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది వాల్యూమ్ స్థాయిలను, మోడ్స్‌ను ఈజీగా తెలుసుకోవడానికి సహాయ పడుతుంది. అలాగే.. దీంతో పాటు వచ్చే స్టైలిష్ రిమోట్ ద్వారా అన్ని.. ఆపరేషన్స్‌ను దూరం నుంచే కంట్రోల్ చేయెచ్చు.

4.కనెక్టివిటీ ఆప్షన్స్ :

Advertisement

ప్రస్తుత డిజిటల్ యుగానికి తగినట్లుగా ఇందులో అన్ని రకాల కనెక్టివిటీ ఆప్షన్లను అందించారు. తాజా బ్లూటూత్ వీ5.3 టెక్నాలజీ దీనిలో ఉంది. దీని వల్ల మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్ ను వైర్‌లెస్ ద్వారా క్షణాల్లో కనెక్ట్ చేసి పాటలు ప్లే చేయెచ్చు. ఇది కాకుండా HDMI, ఆప్టికల్ , AUX, USB పోర్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల టీవీ, ల్యాప్‌టాప్ లేదా పెన్‌డ్రైవ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా కనెక్ట్ చేయొచ్చు.

Also Read: రూ.15వేలకే 40 ఇంచుల స్మార్ట్ హెచ్‌డీ టీవీ..ఫీచర్స్ ఇవే!

5. ఈక్వలైజర్ మోడ్స్ :

యూజర్ల అభిరుచికి తగినట్లుగా సౌండ్ సెట్టింగ్ మార్చుకోవడానికి ఇందులో విభిన్న ఈక్వలైజర్ మోడ్స్ ఇచ్చారు. మీరు సినిమాలు చూసేటప్పుడు.. మ్యూజిక్ వినేటప్పుడు లేదా వార్తలు చూసేటప్పుడు తగిన మోడ్‌ను సెలెక్ట్ చేసుకొని బెస్ట్ ఆడియో ఫీల్ పొందొచ్చు. చెవులకు ఎలాంటి ఇబ్బంది.. కలగకుండా మృదువైన, స్పష్టమైన ట్రెబుల్, బేస్ లభిస్తాయి.

కేవలం రూ. 5,499 ధరలో 320 వాట్ల పవర్, 5.1 ఛానెల్ సపోర్ట్, మోడర్న్ ఫీచర్లు కలిగిన సౌండ్‌బార్ దొరకడం నిజంగా గొప్ప విషయమే. మీరు తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం హోమ్ థియేటర్ ఫీల్ కోరుకుంటున్నట్లయితే.. ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Related News

వాట్సప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. చాట్ స్క్రీన్ నుంచే రీసెంట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేయండిలా!

గూగుల్ బాటలో మెటా.. ఉద్యోగులకు వీఈఓ ఆపర్, ప్యాకేజీ కింద బెనిఫిక్స్ చాలానే

ఇలాంటి ఉద్యోగం కూడా ఉంటుందా? ఇన్‌స్టా రీల్స్ స్క్రోల్ చేస్తే చాలు.. నెలాఖరుకు జీతం!

“మా ఆఫీస్‌లో ఇలాంటి బాస్ ఉంటే బాగుండు!” సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో!

రూ.15వేలకే 40 ఇంచుల స్మార్ట్ హెచ్‌డీ టీవీ..ఫీచర్స్ ఇవే!

శాంసంగ్ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్‌లు..అస్సలు మిస్సవ్వొద్దు

దీపావళి షాపింగ్ చేస్తున్నారా?ఈ 5 సైబర్ మోసాలతో జాగ్రత్త!

Big Stories

Advertisement
×