Hair Growth Tips: ఈ రోజుల్లో.. జుట్టు పల్చబడటం ఒక సాధారణ సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ అధికంగా ఉపయోగించడం. అంతే కాకుండా జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం. బలహీనమైన పలుచని జుట్టు మన అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది.
ఇలాంటి పరిస్థితిలో.. సరైన సమయంలో శ్రద్ధ వహిస్తే, ఈ సమస్యను నివారించడం సులభం. జుట్టు సన్నబడకుండా నిరోధించడానికి కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. ఇవి చాలా ప్రభావ వంతమైన, సహజమైన మార్గాలు. అంతే కాకుండా ఇవి మీ జుట్టును మందంగా, బలంగా మార్చడంలో సహాయపడతాయి.
జుట్టు పెరిగేందుకు చిట్కాలు:
ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోండి:
జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సరైన పోషకాహారం చాలా ముఖ్యం. ఐరప్, కాల్షియం, ప్రోటీన్, ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు , బయోటిన్, విటమిన్ బి వంటి పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది.
ఒత్తిడిని తగ్గించుకోండి, మంచి నిద్ర పొందండి:
జుట్టు రాలడానికి అధిక ఒత్తిడి ఒక ప్రధాన కారణం. కాబట్టి.. ప్రతిరోజూ యోగా, ధ్యానం, లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందండి. దీంతో పాటు.. 7-8 గంటలు బాగా నిద్రపోండి. తద్వారా శరీరం, జుట్టుకు సరైన పోషకాహారం లభిస్తుంది.
సరైన జుట్టు సంరక్షణ:
రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్, క్రమరహిత జుట్టు సంరక్షణ జుట్టును బలహీనపరుస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ సల్ఫేట్, పారాబెన్ లేని షాంపూలను వాడండి. వారానికి 2-3 సార్లు నూనెను సున్నితంగా జుట్టుకు మసాజ్ చేయండి. అంతే కాకుండా జుట్టును వేడి నీటితో శుభ్రం చేయకండి. ఇది తలపై చర్మాన్ని పొడిగా చేస్తుంది.
హెయిర్ కేర్ :
అధిక వేడి, రసాయనాలు జుట్టును సన్నగా, బలహీనంగా మారుస్తాయి. కాబట్టి హెయిర్ డ్రైయర్, స్ట్రెయిట్నర్ , కర్లింగ్ ఐరన్‌లను తక్కువగా వాడండి. అంతే కాకుండా వీటికి బదులుగా, వేడి నుండి రక్షించే స్ప్రేలను వాడటం ద్వారా దానిని స్టైల్ చేయండి. జుట్టుకు రంగు వేయడం లేదా ఇతర రసాయన చికిత్సలను నివారించండి. అంతే కాకుండా సహజ ఎంపికలను ఎంచుకోండి.
Also Read: బియ్యం పిండిలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. చందమామ లాంటి చర్మం
హోం రెమెడీస్ ప్రయత్నించండి:
కొన్ని హోం రెమెడీస్ పాటించడం ద్వారా.. జుట్టును సహజంగా పోషించుకోవచ్చు.
ఉల్లిపాయ రసం: ఇందులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.
మెంతుల పేస్ట్: ది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
అలోవెరా జెల్: ఇది తలపై చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. జుట్టుకు పోషణను అందిస్తుంది.
తలకు మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణను పెంచండి – కొబ్బరి, బాదం లేదా ఆముదం నూనెతో క్రమం తప్పకుండా జుట్టుకు మసాజ్ చేయండి. మీ తల కిందికి ఉంచి 5 నిమిషాలు మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. మసాజ్ చేయడం వల్ల జుట్టు రంధ్రాలు సక్రియం అవుతాయి. అంతే కాకుండా కొత్త జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది.