Actress Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన సమంత మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఏ మాయ చేసావే సినిమాతో హిట్ కొట్టిన ఈమె అనంతరం వరుస తెలుగు, తమిళ భాష చిత్రాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీని ఏలారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న ఈమె నటుడు నాగచైతన్య(Nagachaitanya)తో ప్రేమాయనం నడిపారు. ఇతర రహస్యంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు. అయితే కొన్ని వ్యక్తిగత బేధాభిప్రాయాలు కారణంగా విడాకులు(Divorce) తీసుకుని విడిపోయారు.
డిప్రెషన్ లో సమంత..
ఇలా నాగచైతన్య నుంచి సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కెరియర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ తగ్గించారనే చెప్పాలి. విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమంత సినిమాలను దూరం పెట్టారు. అనంతరం తిరిగి సినిమాలకు కమిట్ అయిన తర్వాత ఈమె మయోసైటిసిస్ అనే వ్యాధికి గురి అయ్యారు. ఈ వ్యాధి కారణంగా దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడిప్పుడే సినిమా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేశారు కానీ సినిమాలకు మాత్రం కమిట్ అవ్వలేదు.
రాజ్ నిడుమోరితో రిలేషన్..
ఇటీవల సమంత నిర్మాణ సంస్థను ప్రారంభించి శుభం అనే సినిమా ద్వారా నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో సమంత సినిమాల కంటే కూడా వ్యక్తిగత విషయాల ద్వారా వార్తలలో నిలుస్తున్నారు. ఈమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మరొక డైరెక్టర్ రాజ్ నిడుమోరి(Raj Nidumori) ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి జంటగా వెకేషన్ లకు వెళ్లడం ఎక్కడ కనిపించినా జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ షేర్ చేసిన క్షణాలలో వైరల్ అవుతుంది.
సమంత పోస్ట్ దాని గురించేనా?
తాజాగా సమంత ఒక ఫోటోని షేర్ చేస్తూ..”అతని ఇల్లు..అతని రూల్స్ “అంటూ ఇచ్చారు. దీంతో సమంత చేసిన ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె మాత్రం ఆ పోస్టును తన పెట్ డాగ్ ను ఉద్దేశించి చేశారని తెలుస్తోంది. తన పెట్ ఇంట్లో తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్న నేపథ్యంలోనే తన ఇంట్లో తన రూల్స్ వినాల్సిందే అన్నట్టు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇక సమంత చివరిగా సిటాడెల్ అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె “రక్త్ బ్రహ్మాండ్” అనే సిరీస్ చేస్తున్నారు అయితే ఇటీవల ఇది కూడా షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తుంది.
Also Read:Manchu Vishnu: పవన్ కళ్యాణ్ తో విష్ణుకు విభేదాలా.. అందుకే కలవలేదా?