BigTV English

Metro Rail : భార్య మీద కోపంతో.. మెట్రో రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. వీడియో వైరల్

Metro Rail : భార్య మీద కోపంతో.. మెట్రో రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. వీడియో వైరల్

Metro Rail : మెట్రో రైల్ దూసుకుపోతోంది. చాలా మంది ప్యాసింజర్లు మొబైల్ ఫోన్లతో బిజీగా ఉన్నారు. కొందరు ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటున్నారు. మరికొందరు నిద్ర పోతున్నారు. అంతా రొటీన్‌గానే ఉంది ఆ మెట్రో జర్నీ. కానీ, అంతలోనే ఒకతను తన దగ్గర ఉన్న బ్యాగ్‌లోంచి ఒక పెద్ద డబ్బా బయటకు తీశాడు. అది పెట్రోల్ బాటిల్. మెళ్లిగా బాటిల్ క్యాప్ ఓపెన్ చేశాడు. పెట్రోల్‌ను మెట్రో బోగిలో చల్లాడు. వెంటనే గుప్పుమని వాసన వచ్చింది. పక్కనున్న వాళ్లు అలర్ట్ అయ్యారు. అతను బాటిల్‌లోని పెట్రోల్‌ను మెట్రోలో వంపుతండగా చూసి హడలిపోయారు. దెబ్బకు అక్కడ ఉన్న వాళ్లంతా పరార్.


పెట్రోల్ వాసన రాగానే ఆ బోగిలో ఉన్న వాళ్లంతా పరుగులు పెట్టారు. అతన్ని అదుపు చేద్దాం అని అందులో ఉన్న ఒక్కరు కూడా అనుకోలేదు. అతన్ని పట్టుకోవడానికి ట్రై చేయలేదు. కంపార్ట్‌మెంట్ మొత్తం క్షణాల్లో ఖాళీ అయింది. ఆ అగంతకుడి పని మరింత ఈజీ అయింది. ఎంచక్కా బ్యాగులోంచి లైటర్ తీసి బోగీలో పోసిన పెట్రోల్‌కు నిప్పు అంటించాడు. భగ్గున మండిపోయింది. చూస్తుండగానే పెద్ద మంట పైకి ఎగిసింది.

160 మంది ప్యాసింజర్లు..


అయితే, అప్పటికే భయంతో అక్కడి నుంచి పారిపోయిన వాళ్లంతా పక్క బోగిలోకి చేరారు. వాళ్లను చూసి ఆ బోగిలో ఉన్న వాళ్లు కూడా పరుగులు పెట్టారు. అలా అంతా తోసుకుంటూ దూరంగా వెళ్లడంతా వాళ్లంతా లాస్ట్ కంపార్ట్‌మెంట్‌లో ఇరుక్కుపోయారు. ఇక ముందుకు వెళ్లలేరు. వెనక్కి రాలేరు. అయితే, మంటలు వ్యాపించకున్నా.. పొగ మాత్రం మొత్తం మెట్రో రైల్‌ను కమ్మేసింది. ఆ పోగకు ఊపిరి ఆడక కొందరు ప్యాసింజర్లు అవస్థ పడ్డారు. ఇంకా కాసేపు అలానే ఉండిఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేది. కానీ, అంతలోనే ఎమర్జెన్సీ అలారమ్స్ మొగడం.. మెట్రోను అర్జెంట్‌గా ఆపేయడం జరిగిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ 160 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పొగ పీల్చిన కారణంగా 23 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది.

భార్యతో విడాకుల కేసు..

ఇదంతా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ సబ్‌వేలో వెళ్తున్న మెట్రోలో జరిగింది. పోలీసులు ఆ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వయస్సు 67 ఏళ్లు. ఎందుకిలా చేశావని ప్రశ్నిస్తే.. అతను చెప్పిన ఆన్సర్ విని కాప్స్ షాక్ అయ్యారు. భార్యతో అతనికి కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ఇటీవలే తీర్పు కూడా వచ్చింది. అయితే, డైవోర్స్ కేసులో కోర్టు జడ్జిమెంట్ అతనికి వ్యతిరేకంగా వచ్చిందట. బాగా హర్ట్ అయిన అతను.. ఇలా మెట్రో రైల్‌లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తన శాడిజం చూపించాడు. అతనికి భార్యతో ప్రాబ్లమ్స్ ఉంటే.. ఇలా మెట్రోలో మంట పెట్టి ఏం సాధించాలని? పిచ్చి కాకపోతే.. ఎవరికైనా ఏమైనా అయి ఉంటే? నిందితుడిని అరెస్ట్ చేసి హత్యయత్నం కేసు నమోదు చేశారు సియోల్ పోలీసులు.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×