Women’s Day 2025 Wishes: మహిళల బలం, ధైర్యం, సహకారాన్ని గౌరవించటానికి ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము. మహిళలు.. కుటుంబానికి, సమాజానికి వెన్నెముక మాత్రమే కాదు, అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ముఖ్యం. అంతే కాకుండా వివిధ రంగాల్లో పనిచేస్తూ.. విజయాల కొత్త శిఖరాలను చేరుకుంటున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మీరు మీ ఇంటి, సమాజంలోని మహిళలకు ఈ విధంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయండి.
తల్లిగా మనకు జన్మనిచ్చి..
అక్కా, చెల్లిగా తన ప్రేమను పంచి..
భార్యగా తన జీవితాన్ని ధారపోసి..
బిడ్డగా అనురాగం పంచుతూ..
అందరి జీవితాల్లో వెలుగులు పంచుతున్న..
స్త్రీ మూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
1. స్త్రీ లేకపోతే జననం లేదు,
స్త్రీ లేకపోతే గమనం లేదు,
స్త్రీ లేకపోతే సృష్టే లేదు,
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
2. పదాలు తెలియని పెదవులకు
అమృత వాఖ్యం అమ్మ
ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ
మహిళగా నీ త్యాగం మరవ లేమమ్మా
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
3. ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో శరవేగంగా..
దూసుకుపోతున్న మహిళలకు,
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
4. యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్రదేవతా
స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో..
అక్కడ దేవతలు నివాసం ఉంటారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
5. కనులు తెరిసిన క్షణం నుండీ.. బంధం కోసం బాధ్యత కోసం..
కుటుంబం కోసం అందర్ని కనుపాపలా తలచి, ఆత్మీయతను పంచి,
తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారి కళల్ని పోషించి
అవమానాల్ని సహించి, వారి భవిష్యత్తు గురించి,
తన ఇంటిని నందనవనం చేసే ప్రతి మహిళలకీ..
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
6.జననం నీవే- గమనం నీవే కర్తవు నీవే-
కర్మవు నీవే సృష్టివి నీవే- ప్రతిసృష్టివి నీవే
ఓ మహిళా నీకు పాదాభి వందనం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
7.కన్నతల్లిగా లాలిస్తావు.. కంటికి రెప్పలా రక్షిస్తావు..
కల్మషం లేని ప్రేమను అందిస్తావు..
చివరి శ్వాస వరకూ ప్రేమించే ఓ తల్లీ నీకు వందనం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
8. ఆడపిల్ల అని ఎన్నటికీ దిగులు చెందకు
ఆడపులిలా అన్నింటినీ ఎదిరించు
ఆడపిల్లగా పుట్టినందుకు గర్వించు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Also Read: ఉమెన్స్ డే 2025 థీమ్ ఏంటో తెలుసా ?
9. కొవ్వొత్తిలా కరుగుతూ.. కుటుంబానికి వెలుగునిస్తూ..
కన్నీళ్లనే దాహంగా తీర్చుకుంటూ.. కుటుంబమే సర్వస్వంగా జీవించే
మహిళలందరికీ..అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
10.కష్టాలు కన్నీళ్లను దిగమింగుకుని..
కుటుంబం కోసం అహర్నిషలు కష్టపడే
మహిళలందరికీ..
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
11.అమ్మగా ఇంటిని చక్క దిద్దగలవు,
భార్యగా ప్రేమనూ పంచగలవు,
చివరి శ్వాస వరకూ స్వచ్ఛమైన ప్రేమను అందిచగలవు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
12. కుటుంబమే తన ఆలోచన..
కుటుంబమే తన ఆవేదన..
కుటుంబమే తన ఆరాధానగా భావించే మహిళలందరికీ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు