Bollywood Actor..సినిమా అనే రంగుల ప్రపంచంలో నెట్టుకురావడం అంటే అంత సులభమైన పని ఏమీ కాదు. ముఖ్యంగా సౌత్ సినిమాలతో పోల్చుకుంటే బాలీవుడ్ సినిమాలలో లిప్ లాక్ సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక బాలీవుడ్ యాక్టర్ మాత్రం 55 ఏళ్ల సినీ కెరియర్ లో అందులోనూ బాలీవుడ్ నటుడు అయ్యుండి కూడా కేవలం ఒకే ఒక లిప్ లాక్ చేశారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసి బాలీవుడ్ లో ఉండి కూడా ఇలా ఎలా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. వాస్తవానికి బాలీవుడ్ అంటేనే లిప్ లాక్ సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ అని , హీరోయిన్స్ తో పోల్చుకుంటే హీరోలు ఎక్కువగా ఘాటైన రొమాన్స్ చేయడానికి ఇష్టపడతారు అని, నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటి ఇండస్ట్రీలో ఉండి కూడా ఈ హీరో ఒకే ఒక లిప్ లాక్ సన్నివేశం చేశారు అని తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ హీరో ఎవరు? అసలు విషయం ఏమిటో.. ఇప్పుడు చూద్దాం..
80 ఏళ్ల వయసులో కూడా యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతున్న బిగ్ బి..
ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. బిగ్ బి ఇండస్ట్రీకి రావడంతోనే ఇండస్ట్రీ గ్లామర్ రెట్టింపు అయింది అని విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు హీరోగా పనికిరాని ముఖం అంటూ ఎంతోమంది విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కాలంలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇప్పుడు స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఏ సినిమాలో నటించినా సరే.. అందులో చిన్న పాత్ర అయినా.. ఆయనకు గొప్ప గౌరవం లభించేది. ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఉదాహరణకు గత ఏడాది నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో.. ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన కల్కి 2898AD సినిమాలో ఈయన పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా అవలీలగా చేసేశారు. అలాంటి ఈయన ఒక హీరోయిన్ తో తొలిముద్దు ఎప్పుడు అందుకున్నారనే విషయం వైరల్ గా మారుతుంది.
Also read:Vishwak Sen: మసూద డైరెక్టర్ తో విశ్వక్ మూవీ..!
55 ఏళ్ల సినీ కెరియర్ లో ఒకే ఒక్కసారి లిప్ లాక్ సీన్..
అసలు విషయంలోకి వెళ్తే అమితాబ్ బచ్చన్ 60 సంవత్సరాల వయసులో.. అందులోనూ 36 సంవత్సరాలు వయస్సున్న ప్రముఖ నటి రాణీ ముఖర్జీ (Rani Mukharjee) తో తొలి లిప్ లాక్ సన్నివేశం చేశారట. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకొని యువత కూడా నెట్టింట పోస్ట్లు పెడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ‘బ్లాక్’ అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. 2005లో విడుదలైన ఈ సినిమాలో రాణీ ముఖర్జీ అంధురాలి పాత్ర పోషించింది. సినిమా క్లైమాక్స్లో ముద్దు అడిగినప్పుడు అమితాబ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ సినిమాకే హైలెట్ లో నిలిచిందని చెప్పాలి. ముద్దు ఎలా ఉంటుందో అని క్లైమాక్స్లో అమితాబ్ ను అడిగి మరీ పెట్టుకుంటుంది హీరోయిన్ రాణి ముఖర్జీ. ఇకపోతే ఈ సన్నివేశం చేసినప్పుడు ఆరోజు రెండుసార్లు బ్రష్ చేసుకుని అమితాబ్ దగ్గరకు వెళ్లినట్లు గతంలో ఆమె వెల్లడించింది. ఇక తర్వాత తాను మరే సన్నివేశంలో కూడా ఇలా లిప్ లాక్ చేయలేదని , తన 55 ఏళ్ల కెరియర్ లో కేవలం ఒకే ఒక్కసారి హీరోయిన్ తో లిప్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.