BigTV English

Walk 10000 Steps : 10 వేల అడుగులు నడిస్తే ఏమవుతుంది?

Walk 10000 Steps : 10 వేల అడుగులు నడిస్తే ఏమవుతుంది?

Walk 10000 Steps : ఆరోగ్యానికి నడక మంచిది. ఇది అందరికీ తెలిసిందే. మరి రోజుకు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా సిద్ధిస్తాయి? అసలు ఎంత దూరం నడిస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతాం? ఈ విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేకున్నా.. బోలెడన్ని అధ్యయనాలు మాత్రం జరిగాయి. వాటి నుంచి విభిన్నమైన సూత్రీకరణలు వచ్చాయే తప్ప ఏకరూపత మాత్రం సున్నా.


అలాంటి 12 అధ్యయనాల లోతుల్లోకి వెళ్లి.. విశ్లేషించిన ఓ తాజా అధ్యయనం కచ్చితమైన ఆన్సర్‌ను కనుగొన్నది. దాని ప్రకారం రోజుకు 2500 నుంచి 2700 అడుగులు నడిస్తే చాలు. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఇక గుండెను గట్టి చేసుకుని హృదయసంబంధిత వ్యాధులన్నింటినీ దూరంగా ఉంచాలని భావిస్తే.. రోజుకు 7,126 అడుగులు నడవాలి. అదే 9 వేల అడుగుల(కచ్చితంగా చెప్పాలంటే8,763) దూరం నడిచారనుకోండి.. మృత్యువు అంత త్వరగా మీదగ్గరకు రాదు.

రోజుకు 2500 అడుగులు నడిస్తే మరణానికి దారి తీసే అనర్థాలు 8% మేర తగ్గుతాయట. 2700 అడుగులు వేస్తే హృదయసంబంధిత వ్యాధుల ముప్పు 11% తగ్గిపోతుందని, అదే 7 వేల స్టెప్పులు నడిస్తే ఆ ముప్పు 51% తగ్గుతుందని తాజా అధ్యయనం తేల్చింది.


9వేల అడుగులు నడవడం వల్ల మృత్యువు త్వరగా సంభవించే అవకాశాలు 60% తగ్గిపోతాయి. మనం నడిచే అడుగులను లెక్కించడంతో పాటు.. మధ్య మధ్యలో నడక వేగాన్ని పెంచగలిగితే ఆరోగ్యపరంగా అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆ అధ్యయనం పేర్కొంది. మరి రోజుకు 10 వేల స్టెప్పుల కంటే ఎక్కువ నడిస్తే ఏమవుతుంది? అనే అనుమానం కలగడం సహజం.

దాని వల్ల మరింత లబ్ధి లభించదు. అనర్థమూ కలగదని యూనివర్సిటీ ఆఫ్మ సాచుసెట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యయనకర్తల్లో ఒకరన డాక్టర్ అమందా పలూచ్ వివరించారు. వయసులో ఉన్నప్పుడు ఎన్ని వేల అడుగులైనా అలవోకగా నడిచేస్తాం. మరి వార్ధక్యం మీద పడినప్పుడో?


సీనియర్ సిటిజన్లకు 10వేల అడుగుల టార్గెట్ సాధ్యమేనా? ఈ సందేహాల్లో వాస్తవం లేకపోలేదు.పెద్దవాళ్లు 500 అడుగులు నడవగలిగితే చాలని మరో అధ్యయనకర్త డాక్టర్ మోర్గాన్ తెలిపారు. అంటే 2 కిలోమీటర్ల దూరమన్న మాట. వయసు మీదపడిన వాళ్లు ఆ మాత్రం నడిస్తే 8 కిలోమీటర్లు నడిచినంత లబ్ధి చేకూరుతుంది. ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ ఆఫ్ అమెరికన్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. సో.. ఇంకెందుకు ఆలస్యం? నడిచేద్దాం పదండి.

Related News

Cycling Vs Running: సైక్లింగ్ Vs రన్నింగ్.. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఏది బెస్ట్ ?

Brain Health: మెదడును.. నిశ్శబ్దంగా దెబ్బతీసే అలవాట్లు ఇవే !

Raw vs Roasted Nuts: పచ్చి గింజలు Vs వేయించిన గింజలు.. ఏవి తింటే మంచిది ?

Junnu Recipe: జున్ను పాలు లేకుండానే జున్ను తయారీ.. సింపుల్‌గా చేయండిలా !

Papaya Seeds: బొప్పాయి సీడ్స్ తింటే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Walking Backwards: రోజూ 10 నిమిషాలు వెనక్కి నడిస్తే.. ఇన్ని లాభాలా ?

Homemade Hair Spray: ఈ హెయిర్ స్ప్రే వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది తెలుసా ?

Ghee With Hot Water: డైలీ మార్నింగ్ గోరు వెచ్చటి నీటిలో నెయ్యి కలిపి తాగితే.. మతిపోయే లాభాలు !

Big Stories

×