Cashew Benefits: చలికాలంలో జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది అధిక పోషకాలు ఉన్న డ్రై ఫ్రూట్. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో జీడిపప్పు సహాయపడుతుంది. చలికాలంలో జీడిపప్పు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా జీడిపప్పు తినడం వల్ల కూడా ఎముకలు ఎంతో బలంగా ఉంటాయి.
జీడిపప్పు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. ఇందులో ఉండే సమ్మేళనాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడతాయి. శీతాకాలంలో జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి బూస్ట్: శీతాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. జీడిపప్పులో విటమిన్ బి, జింక్ , సెలీనియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. దీంతో జలుబు, దగ్గు వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
ఎముకలను బలపరుస్తుంది: జీడిపప్పులో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. చలికాలంలో ఎముకల నొప్పుల సమస్య సర్వసాధారణం. జీడిపప్పు తీసుకోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: జీడిపప్పులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చర్మానికి మేలు చేస్తుంది: జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మార్చుతుంది.
జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది: జీడిపప్పులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: ఇలా చేస్తే.. క్షణాల్లోనే మీ పళ్లు మెరిసిపోతాయ్
ఒత్తిడిని తగ్గిస్తుంది: జీడిపప్పులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సెరోటోనిన్ ఒక న్యూరోట్రాన్స్మిటర్, ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.అంతే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది.