BigTV English

Drumstick Leaves Benefits: మునగాకు లాభాలు తెలిస్తే.. వదలకుండా తింటారు

Drumstick Leaves Benefits: మునగాకు లాభాలు తెలిస్తే.. వదలకుండా తింటారు

Drumstick Leaves Benefits: మునగ అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ అద్భుతమైన మొక్క యొక్క పూలు, వేర్లు, ఆకులు, కాయలు, బెరడుతో సహా ప్రతిదీ ఔషధాలు తయారీలో ఉపయోగిస్తారు. ఇన్ని ఔషధ గుణాలు ఉన్న మునగ ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. మునగాకును సాంబారు, కారంపొడి, రసంతో పాటు రొట్టెలు సహా రకరకాల ఆహార పదార్థాలల్లో వాడటం మంచిది. ఇలా మునగాకు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగ ఆకు గురించిన మరిన్ని అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


యాంటీ ఇన్ఫ్లమేటరీ:
మునగాకు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతంది. ఐసోసైనేట్లు మునగ ఆకులో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని పలుచోట్ల వచ్చే వాపు, నొప్పుల వంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా వీటిలోని విటమిన్ సి తో పాటు పలు పోషకాలు ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తిని బలపరిచి వ్యాధులు రాకుండా చేస్తాయి.

చర్మ సంరక్షణ:
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మునగాకు తినడం వల్ల నిస్తేజమైన చర్మానికి తిరిగి తేజస్సు అందుతుంది. చర్మాన్ని యవ్వనంగా మృదువుగా మార్చడంలో ఇది సహాయపడుతుంది. ఆరోగ్యమైన మెరుపును కూడా అందిస్తుంది. మునగాకు పేస్టు ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.


జుట్టు పెరుగుదలకు:
మునగాకు జుట్టు సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని పేస్ట్ లాగా చేసి తలకు రాసుకోవడం వల్ల చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారేందుకు మునగాకు చాలా బాగా పనిచేస్తుంది.

కొలెస్ట్రాల్ నియంత్రణ:
కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మునగ మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. మునగాకుల శరీరంలోని కొవ్వును తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ మునగాకుతో పప్పు లేదా కారంపొడి వంటివి తయారు చేసుకుని తినడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ధమనుల గోడల్లో ఏర్పడే కొలెస్ట్రాల్ ను ఇది తగ్గిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.

Also Read:  ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? జాగ్రత్త !

బరువు తగ్గడంలో:
రోజువారి ఆహారంలో మునగ చేర్చుకోవడం వల్ల పొట్టలోని కొవ్వు తగ్గుతుంది. మునగాకు టీ, మునగాకు పొడి, మునగాకు టమాట, మునగాకు పప్పు ఇలా ఏదో రకంగా మునగాకుని తినడం వల్ల శరీర బరువు ఎప్పుడు నియంత్రణలోనే ఉంటుంది. మునగాకు బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది.

కాలేయ ఆరోగ్యం:
మునగాకు కాలేయ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయన్ని ఎల్లప్పుడూ రక్షించే సామర్థ్యం ఇది కలిగి ఉంటుంది. దెబ్బతిన్న కాలేయ కణాలను కూడా సరిచేస్తుంది. శరీరంలో ప్రోటీన్స్ స్థాయిలను మెరుగుపరచడానికి మునగ చక్కగా ఉపయోగపడుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×