Saffron Benefits: కుంకుమపువ్వు ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. కుంకుమపువ్వును సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. కుంకుమ పువ్వుతో తయారుచేసిన హోం రెమెడీస్ కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
శీతాకాలంలో కుంకుమపువ్వు అధికంగా లభిస్తుంది. కుంకుమపువ్వును ముఖ్యంగా తీపి వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వు ఔషధ గుణాలకు నిలయం అని, దాని వినియోగం శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని చెబుతారు. కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. దానిని తినడం వల్ల చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. కుంకుమపువ్వు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా కళ్ళకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
కుంకుమ పువ్వును ‘ఎరుపు బంగారం’ అని కూడా పిలుస్తారు. కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. కుంకుమపువ్వు వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
కుంకుమ పువ్వు యాంటిడిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది:
కుంకుమ పువ్వు మెదడుకు మంచిదని భావిస్తారు.ఇది జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కళ్ళకు మేలు:
కుంకుమ పువ్వు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంటి సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
కుంకుమపువ్వు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది:
కుంకుమ పువ్వు చర్మాన్ని ప్రకాశవంతంగా , ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో, మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఫలితంగా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
కుంకుమపువ్వు పాలు: రాత్రి పడుకునే ముందు, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొన్ని కుంకుమపువ్వు ఆకులు వేసి త్రాగాలి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో , మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కుంకుమ పువ్వు పాలు త్రాగడం మంచిది.
కుంకుమపువ్వు ఫేస్ ప్యాక్: కొన్ని కుంకుమపువ్వు ఆకులను కొద్దిగా పాలలో నానబెట్టి రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలను కూడా చాలా వరకు తగ్గించడంలో కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది.
కుంకుమ నూనె: కుంకుమ నూనెతో మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పులు ,కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కుకుంమ పువ్వు నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Also Read: గ్రీన్ టీ తాగుతున్నారా ? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే !
కుంకుమ పువ్వుతో టీ: కొన్ని కుంకుమపువ్వు ఆకులను వేడి నీటిలో వేసి కాసేపు అలాగే ఉంచండి. తర్వాత ఈ టీని ఫిల్టర్ చేసి తాగండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి , ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.