India’s First Online Train Ticket: భారతీయ రైల్వే సంస్థ (Indian Railways)ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ.. రోజు రోజుకు అప్ డేట్ అవుతున్నది.. ఒకప్పుడు రైల్వే స్టేషన్ కౌంటర్లలో మాత్రమే టికెట్లు (Train Tickets) పొందే అవకాశం ఉండేది. నెమ్మదిగా టికెటింగ్ లో కంప్యూటరైజేషన్ పెరిగింది. ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలన్నా, ఇంట్లో ఉండే క్షణాల్లో టికెట్లు బుక్(Online Train Tickets Booking) చేసుకునే అవకాశాన్ని కల్పించింది రైల్వే సంస్థ. స్టేషన్ లోని టికెట్ కౌంటర్(Railway Ticket Counter) ముందు క్యూలో నిలబడే పని లేకుండా చేసింది. అయితే, దేశంలో తొలిసారి ఆన్ లౌన్ ద్వారా టికెట్లు పొందే అవకాశం ఎప్పుడు? ఎక్కడ? అందుబాటులోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఢిల్లీలో తొలిసారి కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ ప్రారంభం
భారతీయ రైల్వే సంస్థ తొలిసారి 1986లో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (New Delhi Railway Station)లో ఈ విధానాన్ని అమలు చేసింది. కంప్యూటరైజేషన్ కు ముందు మాన్యువల్ రిజిస్ట్రీ ఎంట్రీ పద్దతిని అనుసరించే వారు. ఈ విధానం వల్ల ప్రయాణీకులు గంటల తరబడి రైల్వే కౌంటర్ ముందు క్యూలో నిలబడాల్సి వచ్చేది. ప్రయాణీకులకు టికెట్ తీసుకునే విధానాన్ని సులభతరం చేసేందుకు 1986లో ఇండియన్ రైల్వే కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1985లో కంప్యూటరైజ్డ్ టికెట్ల జారీ కోసం ఓ పైలెట్ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టింది. 1986లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సంవత్సరం న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ లో తొలి కంప్యూటరైజ్డ్ టికెట్ ను ప్రయాణీకుడికి ఇచ్చారు. ప్రస్తుతం భారతీయ రైల్వే టికెట్లలో సుమారు 80 శాతం టికెట్లు IRCTC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ లో బుక్ చేయబడుతున్నాయి. ఇండియన్ రైల్వే కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల రిజర్వేషన్ నెట్ వర్క్ గా కొనసాగుతోంది. ఈ విధానం దేశ వ్యాప్తంగా 8,000 కంటే ఎక్కువ టెర్మినల్స్ తో దాదాపు 2,222 ప్రదేశాలలో అందుబాటులో ఉంది.
భారతీయ రైల్వేకు 170 ఏండ్ల చరిత్ర
భారతీయ రైల్వేకు సుమారు 170 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రైల్వే సంస్థ అప్ డేట్ అవుతూ వస్తున్నది. టెక్నాలజీతో పాటు రైళ్లలోనూ అనేక మార్పులు వచ్చాయి. రైళ్లలో అత్యాధునిక టాయిలెట్లను ఏర్పాటు చేయడం, స్లీపర్ కోచ్ లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రస్తుతం సెమీ హైస్పీడ్ రైళ్లను(Semi High Speed Trains) అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు సుదూర రైలు ప్రయాణాల కోసం త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లను(Vande Bharat Sleeper Trains) అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు (Hydrogen Train)తో పాటు దేశీ బుల్లెట్ రైళ్లను(Desi Bullet Trains) అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ (Union Budget 2025-26)లో రైల్వే కోసం ఏకంగా రూ. 2.5 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేశారు.
Read Also: ఒకేసారి పట్టాలెక్కనున్న 9 వందేభారత్ స్లీపర్ రైళ్లు, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!