Mahesh Kumar Goud: కులగణన సర్వేపై మాజీ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కులగణన సర్వే ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా జరిగిందని అన్నారు. కేటిఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా తెలంగాణ సర్కార్ చేసిన కులగణన సర్వేపై విమర్శలు చేయడాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు.
రేవంత్ సర్కార్ రాష్ట్రంలో కులగణన సర్వే ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా చేసిందని అన్నారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇల్లిల్లు పరిశీలన చేసి కులగణన చేశామని చెప్పారు. కులగణన దేశానికే ఆదర్శంగా చేపట్టామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటిఆర్ ఏదేదో నోటి కి వచ్చినట్లు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాల అనుసారం మేరకు తెలంగాణలో కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పంతో పూర్తి చేసిందని చెప్పారు. కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని మండిపడ్డారు. 1931 తర్వాత దేశంలో కులగణన జరిగిందని.. దీని వల్ల బీసీలకు ఎంతో మేలు జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
Also Read: Manager Jobs: సువర్ణవకాశం.. డిగ్రీ, బీటెక్ అర్హతలతో ఉద్యోగాలు.. జాబ్ వస్తే లక్షకు పైగా జీతం..
దేశంలో పక్కా పకడ్బందీగా కులగణనను ఫస్ట్ టైం చేసిన ఘటన తమ కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆయన చెప్పుకొచ్చారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడడం అవివేకమని అన్నారు. బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేక పోతున్నారని చెప్పారు. కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రీ – సర్వే గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. బలహీనవర్గాల గురించి కేటీఆర్ మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
Also Read: Manager Jobs: SBIలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,00,000 జీతం.. జస్ట్ ఈ అర్హతలుంటే చాలు..!
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్- బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటిచేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు.