Spinach Benefits: ప్రతి రోజు వివిధ రకాల వంటకాల తయారీలో పాలకూరను ఉపయోగిస్తూ ఉంటారు. పాలకూరలో ఐరన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు A, C , K సమృద్ధిగా ఉంటాయి. పాలకూరను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఫలితంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది ఎముకల బలాన్ని పెంచడంలో.. జీర్ణక్రియ, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పాలకూరను తరచుగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర అనేది పోషకాలు అధికంగా ఉండే ఆకుకూర. ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాకుండా వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది.
రక్తపోటు నియంత్రణ:
పాలకూరలో సహజ నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా పాలకూర తినడం ద్వారా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
కంటి చూపుకు మేలు:
క్యారెట్ మాత్రమే కాదు.. పాలకూర కూడా కంటి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పాలకూరలో లుటీన్ , జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్ళను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా కంటిశుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్ ఎ, సి, ఇ కళ్ళను రక్షిస్తాయి. అంతే కాకుండా వయస్సు పైబడిన తర్వాత వచ్చే కంటి సమస్యలను నివారిస్తాయి.
జీర్ణక్రియను మెరుగుదల:
జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు పాలకూరను తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యలను తొలగిస్తుంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది.
ఒక కప్పు వండిన పాలకూరలో 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పేగులను శుభ్రపరచడంలో ఇది సహాయపడుతుంది అంతే కాకుండా అజీర్ణం నుండి ఉపశమనం అందిస్తుంది.
ఎముకలకు బలం:
పాలకూర విటమిన్ K కి గొప్ప మూలం. ఇది బలమైన ఎముకలు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతే పాలకూరలో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి కాల్షియం శోషణను ప్రభావితం చేస్తాయి.
ఇందులో ఉండే విటమిన్ కె ఎముక సాంద్రతను నిర్వహిస్తుంది.
ఐరన్ లోపం:
రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారు పాలకూర తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. హిమోగ్లోబిన్ ఏర్పడటానికి పాలకూర సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను కూడా పాలకూర మెరుగుపరుస్తుంది.
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను పాలకూరతో కలిపి తినండి. కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో కూడా పాలకూర సహాయపడుతుంది. పాలకూరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , ఫోలేట్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా.. ఇది పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
Also Read: గ్లిజరిన్‌లో ఈ 2 కలిపి వాడితే.. రాలిన చోట కొత్త జుట్టు వస్తుంది
మరిన్ని ప్రయోజనాలు:
పాలకూరలోని యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి.
పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పాలకూరలోని థైలాకోయిడ్స్ , సల్ఫర్ కలిగిన చక్కెరలు గట్ మైక్రోబయోమ్‌ను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది పేగు పొరను బలపరుస్తుంది. ఫలితంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పాలకూర
ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.