BigTV English

Robinhood Movie : SRHపై ట్రోల్స్ కూడా చేయించారా… మీ మూవీ పబ్లిసిటీ కోసం ఎంతపనైనా చేస్తారా..?

Robinhood Movie : SRHపై ట్రోల్స్ కూడా చేయించారా… మీ మూవీ పబ్లిసిటీ కోసం ఎంతపనైనా చేస్తారా..?

Robinhood Movie..’జయం’ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో నితిన్ (Nithin) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తేజ (Director Teja)డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా నితిన్ కు మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈయన రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘సై’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత అ ఆ, భీష్మ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నితిన్.. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వెంకీ కుడుముల (Venky kudumula)దర్శకత్వంలో రాబిన్ హుడ్ (Robin hood) సినిమా చేస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు మార్చి 28వ తేదీన రానున్న విషయం తెలిసిందే.


మూవీ ప్రమోషన్స్ కోసం ఎస్ఆర్హెచ్ టీం పై ట్రోల్స్..

ఇక విడుదల తేదీకి ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉన్న కారణంగా ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టీం.. పాడ్ కాస్ట్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం పై కూడా ట్రోల్స్ చేస్తూ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా ఈ వీడియో పై పలువురు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాలో కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.


మండిపడుతున్న ఎస్ ఆర్ హెచ్ టీం ఫ్యాన్స్..

అయితే ఇప్పుడు ఈయన్ని కూడా ప్రమోషన్ కి వాడుకుంటూ ఏకంగా ఎస్ఆర్హెచ్ టీం పై ట్రోల్స్ చేశారు. ఇక అసలు విషయంలోకెళితే.. డేవిడ్ వార్నర్ ఒక పేపర్ పట్టుకొని నిల్చున్నాడు. అందులో నేను ఎస్ ఆర్ హెచ్ లో ఉన్నాను అన్నట్టు అర్థం వచ్చేలా ఆ పేపర్లో రాసి ఉంది. ఇక వెంటనే ఆ పేపర్ను మార్చేసి నేను ఆర్ హెచ్ (రాబిన్ హుడ్) లో ఉన్నాను అన్నట్టు మళ్లీ శ్రీ లీల (SreeLeela), నితిన్(Nithin ) పేపర్ మార్చేశారు. అయితే ఇదంతా డేవిడ్ వార్నర్ కి తెలిసే జరుగుతోందా? అని నెటిజన్స్ కామెంట్లు చేస్తుండగా.. మరికొంతమంది మీ మూవీ ప్రమోషన్స్ కోసం ఎంతకైనా దిగజారుతారా? అంటూ ఎస్ ఆర్ హెచ్ అభిమానులు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే డేవిడ్ వార్నర్ 2016లో ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీం కి కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను టీం నుంచి తప్పించడంతో ఇప్పుడు దీనిపై ట్రోల్స్ చేస్తూ ఈ రకంగా వీడియో చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనికి నితిన్ మూవీ టీం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఇకపోతే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నితిన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.. మరి నితిన్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×