Sunil Narine: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా మార్చ్ 26 బుధవారం రోజు రాజస్థాన్ రాయల్స్ – కలకత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కి కలకత్తా ప్లేయర్ సునీల్ నరైన్ {Sunil Narine} దూరమయ్యాడు. అయితే అతడు అనారోగ్యానికి గురయ్యాడని, దీంతో రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ కి దూరమయ్యాడని కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహనే తెలిపారు. ఈ మేరకు టాస్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read: HCA – IPL Tickets: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. వాళ్లకు ఐపీఎల్ టికెట్లు !
ఈ క్రమంలో కలకత్తా నైట్ రైడర్స్ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. సునిల్ నరైన్ స్థానంలో మొయిన్ అలీని జట్టులోకి తీసుకుంది. అయితే కలకత్తా నైట్ రైడర్స్ తరఫున వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బంధం విడదీయలేనిది. గత నాలుగు సంవత్సరాలుగా కలకత్తా జట్టు ప్లేయింగ్ లెవెల్ లో ఉన్న ఏకైక ఆటగాడు సునీల్ నరైన్. జట్టులోకి ఎవరు వచ్చినా.. ఎవరు వెళ్లినా.. సునీల్ నరైన్ మాత్రం కామన్ గా ఉంటాడు.
అయితే నాలుగేళ్ల తర్వాత నరైన్ ఐపిఎల్ మ్యాచ్ మిస్ అవ్వాల్సి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో నరైన్ {Sunil Narine} ప్లేయింగ్ లెవెన్ లో లేకపోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగానే అతడు ఈ మ్యాచ్ లో ఆడడం లేదని కెప్టెన్ అజింక్య రహనే తెలిపాడు. ఈ నేపథ్యంలో 1435 రోజుల తర్వాత నరైన్ ఐపీఎల్ మ్యాచ్ మిస్ కావడం ఇది తొలిసారి.
చివరిసారిగా 2021లో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు పై మ్యాచ్ మిస్ అయ్యాడు సునీల్ నరైన్. అతడు లేకపోయినా అతడి స్థానంలో వచ్చిన మోయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ సీజన్ లోని తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డ విషయం తెలిసిందే. కలకత్తా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సిబి జట్టు ఘనవిజయం సాధించింది.
Also Read: IPL’s Brand Value: లక్ష కోట్లు దాటిన ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ…!
ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ బ్యాటింగ్ లో 26 బంతుల్లో 44 పరుగులు చేసి కలకత్తా జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాడు. అలాగే బౌలింగ్ లో కూడా నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అలాంటి ప్లేయర్ జట్టుకు దూరం కావడం కేకేఆర్ కి ఒక రకంగా ఇబ్బందికరమైన విషయమేనని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక కలకత్తా ఆడబోయే తదుపరి మ్యాచ్ కి అయినా సునీల్ నరైన్ అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.