Glycerin For Hair: ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా హెయిర్ ఫాల్‌తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ సమస్య నుండి బయట పడటానికి చాలా మంది వివిధ రకాల షాంపూలతో పాటు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఇందుకోసం వేలల్లో ఖర్చు చేసే వారు కూడా లేకపోలేదు. కానీ గ్లిజరిన్ మీ జుట్టు సమస్యలను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
గ్లిజరిన్ యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జుట్టును కూడా మెరిసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. గ్లిజరిన్ లో ఉండే గుణాలు జుట్టుకు తేమను అందిస్తాయి. అంతే కాకుండా జుట్టును మృదువుగా , సిల్కీగా చేస్తాయి.
గ్లిజరిన్ తరచుగా వాడటం వల్ల డ్యామేజ్ అయిన జుట్టు తిరిగి కొత్త మెరుపును పొందుతుంది. గ్లిజరిన్ ఒక సహజ మాయిశ్చరైజర., ఇది జుట్టు రాలడం, చివర్లు చిట్లడం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టును బలంగా, అందంగా మారుస్తుంది . తరచుగా జుట్టుకు గ్లిజరిన్ వాడటం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న గ్లిజరిన్‌ను ఒత్తైన జుట్టు కోసం ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అలోవెరా జెల్, గ్లిజరిన్ హెయిర్ మాస్క్:
కావాల్సినవి:
అలోవెరా జెల్- 1 చిన్న కప్పు
గ్లిజరిన్ – 4 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె- తగినంత
తయారీ విధానం:
సిల్కీ జుట్టు కోసం గ్లిజరిన్ అలోవెరా జెల్‌తో పాటు హెయిర్ మాస్క్ తయారు చేసి వాడటం మంచిది. పైన తెలిపిన మోతాదులో కలబంద జెల్ తీసుకొని అందులో గ్లిజరిన్ కలిపి మిక్స్ చేయండి. ఇందులో కొద్ది మోతాదులో కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ అన్ని పదార్థాలను బాగా కలిపి జుట్టుకు అప్లై చేసి.. దాదాపు 25 లేదా 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. వారానికి ఒకసారి ఈ అద్భుతమైన హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల అనేక అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.ఒత్తైన జుట్టు కోసం ఈ హెయిర్ మాస్క్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
2. గ్లిజరిన్, తేనె, కొబ్బరి నూనె:
కావాల్సినవి:
గ్లిజరిన్- తగినంత
తేనె- 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె- 4 టేబుల్ స్పూన్లు
Also Read: ముఖం నల్లగా మారిందా ? ఇవి వాడితే.. నిగనిగలాడే చర్మం
తయారీ విధానం:
పైన తెలిపిన మోతాదుల్లో గ్లిజరిన్, తేనె , కొబ్బరి నూనెలను మిక్స్ చేసి హెయిర్ మాస్క్ లాగా తయారు చేయండి. ఇలా తయారు చేసిన ఈ హెయిర్ మాస్కును జుట్టుకు అప్లై చేయాలి. దీనిని 30 నిమిషాల పాటు జుట్టుకు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పెరుగుదలకు కూడా ఈ హెయిర్ మాస్క్ చాలా మేలు చేస్తుంది. తరచుగా ఈ హెయిర్ మాస్క్ వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.