BigTV English

Benefits Of Yoga: యోగాతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా ?

Benefits Of Yoga: యోగాతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా ?

Benefits Of Yoga: ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి డబ్బు సంపాదించే యంత్రం లాగా మారిపోయాడు. తనను తాను మరిచిపోయి టార్గెట్లు, లక్ష్యాలతో పరుగులు తీస్తున్నాడు. స్త్రీ, పురుష భేదం లేకుండా 24 గంటలు కష్టపడుతున్నారు. కానీ తమ కంటూ ఓ గంట సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మంచి శారీరక శ్రమకు దూరం అయ్యాడు. ఫలితంగా మానసికంగా బలహీనపడడమే కాకుండా అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు.


ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం:
అనారోగ్య సమస్యల కారణంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. అందుకే రకరకాల డైట్‌లు కూడా పుట్టుకొస్తున్నాయి. వీలైనంత వరకు అందరూ ఆరోగ్య సూత్రాలను కూడా పాటిస్తున్నారు. జిమ్‌ల బాట పడుతున్నారు. యోగా అత్యంత మేలైందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫిట్నెస్ అవగాహన అవసరం:
ఫిట్నెస్ అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకు వచ్చేది యోగానే. యోగాకు ఇప్పుడు అంతటి ఆదరణ ఉంది మరి. రోజు యోగాసనాలు చేయడం ద్వారా రోగాలు దరిచేరకుండా ఉంటాయి. యోగా వల్ల మానసిక రుగ్మతలయి కూడా తొలగిపోతాయి.మొండి రోగాలను సైతం నయం చేయగల శక్తి యోగాకు ఉందని చెబుతుంటారు. సంపూర్ణ ఆరోగ్యానికి డాక్టర్లు సూచించే ప్రథమ అవసరం కూడా యోగా. యోగా సాధనతో ఆరోగ్యం సంపూర్ణ, సమగ్ర వ్యక్తిత్వ వికాసం కూడా జరుగుతుంది. సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిలా రూపుదిద్దుకుంటాడు.


యోగాతో ప్రయోజనాలు:

  • సాధారణ శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలు యోగాతో వల్ల కలుగుతుంది. పాశ్చాత్య ప్రపంచం కూడా యోగ పట్ల ఆకర్షితమవుతుంది.
  • యోగా వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. శరీరం నుంచి టాక్సీ‌‌న్‌లు వేగంగా బయటకు వెళ్లిపోతాయి.
  • అందమైన శరీర ఆకృతి కూడా యోగా వల్ల వస్తుంది.
  • ఎవరైనా సులభంగా చేయగలిగే ధ్యానం యోగాలో ప్రధానమైంది.
  • శ్వాస ప్రక్రియపై ఏకాగ్రత ఉంచి సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
  • యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక బలం, నిత్య యవ్వనంగా ఉండవచ్చు.
  • యోగా సాధన అంటే సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామ, ధ్యాన, ముద్రలు, క్రియలు మాత్రమే కాదు.యోగా అంటే సాధ్యమైన భంగిమలతో తన శరీరాన్ని వంచడమే కాకుండా.. మనసు, శరీరాల సంయోగంతో శ్రద్ధగా చేస్తే దీనివల్ల అనేక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
  • క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. రక్తపోటు నివారణ, ఒత్తిడి తగ్గడం, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ నియంత్రణ వంటి ప్రయోజనాలు ఉంటాయి.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×