జుట్టు ఉన్న అమ్మ కొప్పు ఎలా పెట్టినా బాగానే ఉంటుందని ఓ సామెత ఉంది. అంటే, మహిళలకు జుట్టు ఎంత పొడవుగా ఉంటే అంత మంచిది. అంత అందంగా కనిపిస్తారు అనేది ఈ సామెత ఉద్దేశం. ఇక మగాళ్లు కూడా తమ జుట్టును రకరకాల స్టైల్స్ లో కట్ చేయించుకుంటారు. ఇందుకోసం హెయిర్ సెలూన్లలో బోలెడు డబ్బులు పోస్తారు. కానీ, మగాళ్లు జుట్టు పెంచుకోవడం కంటే, జుట్టు లేకుండా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. గుండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ మెయింటెనెన్స్ తక్కువ, టైమ్ ఆదా
గుండు చేసుకోవడం వల్ల జుట్టు కోసం పెట్టాల్సిన ఖర్చు తగ్గిపోతుంది. అదే సమయంలో టైమ్ బాగా సేవ్ అవుతుంది. స్టైల్ గా దువ్వుకోవడం, ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ రాసుకోవడం లాంటి అవసరం ఉండదు. సింఫుల్ గా తల స్నానం చేసే అవకాశం ఉంటుంది.
⦿ డబ్బులు ఆదా
గుండు చేయించుకోవడం వల్ల డబ్బు బాగా ఆదా చేసుకోవచ్చు. షాంపూలు, కండిషనర్లు, హెయిర్ జెల్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. తరచుగా హెయిర్ సెలూన్స్ వెళ్లే అవసరం లేదు. మంచి రేజర్ లేదంటే ఎలక్ట్రిక్ షేవర్ ఉంటే సరిపోతుంది.
⦿ జుట్టు రాలే సమస్య ఉండదు
జుట్టు పల్చగా ఉండటం లేదంటే బట్టతల ఉన్న వాళ్లు శుభ్రంగా గుండు చేయించుకుని ఇంత నూనె రాస్తే మెరుస్తూ నిగనిగలాడుతుంది. జుట్టు రాలే సమస్య అస్సలే ఉండదు. జుట్టు కోసం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పని లేదు.
⦿ తల ఆరోగ్యం
గుండు చేయించుకోవడం వల్ల బట్టతల, చుండ్రు సమస్యలు ఉండవు. జుట్టు చిరాకు కలిగించదు. జుట్టు మీద చెమట, దుమ్ము, ధూళి పట్టుకోదు. గుండు ఎల్లప్పుడూ శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది. వేడి వాతావరణంలో గుండు చాలా మంచిది. చెమట పేరుకుపోయి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
⦿ కంఫర్టబుల్ ఫీలింగ్
హాట్ వెదర్ లో గుండు చేయించుకుంటే చాలా రిలీఫ్ కలుగుతుంది. జుట్టు లేకపోవడం వల్ల శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది. చెమట లాంటి అసౌకర్యం ఉండదు. అందుకే, చాలా మంది అథ్లెట్లు, ఫిట్ నెస్ లవర్స్ ఎక్కువగా గుండుతో కనిపిస్తారు.
Read Also: ఒక్కో రంగు గులాబీ వెనుక ఒక్కో అర్థం, వాలంటైన్స్ డే వీక్ లో ఏ గులాబీ ఎవరికి ఇవ్వాలంటే?
⦿ కాన్ఫిడెంట్ లుక్
గుండు చేయించుకున్న వారిలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మీ ముఖం మీ లక్షణాలను బలంగా బయటకు కనిపించేలా చేస్తుంది. క్రమశిక్షణ, స్వీయ భరోసాను కల్పిస్తుంది.
⦿ జుట్టు సమస్యలు ఉండవు
ఇక జుట్టు చిట్లిపోతుంది, జుట్టు రాలిపోతుంది, జుట్టు పలుచగా మారిపోతుంది.. లాంటి సమస్యలు ఉండవు. గుండు చేయించుకోవడం వల్ల ఎలాంటి జుట్టు సమస్యలు అనేవి ఉండవు. మొత్తంగా గుండు చేసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా, మానసిక పరంగా బోలెడు లాభాలు ఉన్నాయి. పరిశుభ్రతతో పాటు ఆత్మ విశ్వాసాన్ని కలిగించడంలో జుట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Read Also: చిన్న కౌగిలింతతో బోలెడన్ని బెనిఫిట్స్.. హగ్ ఇవ్వండి గురూ!