Green Tea Side Effects: ప్రస్తుతం చాలా మంది గ్రీన్ టీ, బ్లాక్ టీ అని ఒక సమయం సందర్భంగా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తాగుతున్నారు. బయటకు వెళితే చాలు గ్రీన్ టీ బరువు తగ్గుతారు, ఆరోగ్యానికి మంచిదని తాగేస్తున్నారు. అయితే ఈ గ్రీన్ టీ ఆరోగ్యానికి మనం అనుకునేంత మంచిది కాదు. దీనిన తాగడం వల్ల పలు రకాల సమస్యలు వస్తున్నాయని పలు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గుండె కోట్టుకోవడంలో మార్పు:
గ్రీన్ టీలో కెఫీన్ తక్కువగా ఉన్నపటికి.. శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. దీంతో కడుపునొప్పి, కడుపులో మంటలు వంటివి కలుగుతాయి. గ్రీన్ టీ మంచిదని అందరు దీనిని తాగుతున్నారు. కానీ దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుందని తెలిపారు. ఈ గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీరంలోని గుండె కోట్టుకునే విధానంలో మార్పు జరుగుతుందని చెబుతున్నారు. అలాగే హార్ట్ బీట్ పెరిగే ప్రమాదం కూడా ఉంది. నార్మల్ హార్ట్ బీట్ చేంజ్ అవుతే మీ ప్రాణాలకే ప్రమాదం. చాలామంది తలనొప్పి నుంచి రిలీఫ్ అవ్వడానికి దీనిని తాగుతారు. కానీ, దీన్ని తాగడం వల్ల తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
గ్రీన్ టీలో కెఫీన్, టానిన్స్, కొన్ని యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వల్ల అనేలియా అంటే.. రక్తహీనత గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐరన్ డేఫిసియేన్సీ సమస్య ఎక్కవగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దీని మూలంగా కళ్లపై ఎక్కువ ప్రెజర్ పడుతుంది, దీనిన ఎక్కువగా సేవించడం వల్ల అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు.
కెఫీన్ సంబంధిత సమస్యలు:
గ్రీన్ టీలో ఉండే కెఫీన్ నిద్ర చక్రాన్ని భంగపరుస్తుంది, ముఖ్యంగా రాత్రి వేళల్లో తాగితే.
ఆందోళన, గుండె దడ, లేదా నాడీ వ్యవస్థ ఉద్రేకాన్ని కలిగిస్తుంది. అయితే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి, గుండెల్లో మంట లేదా రిఫ్లక్స్ సమస్యలు రావచ్చు. దీనిలోని టానిన్స్ అధికంగా తీసుకుంటే కడుపు గోడలను చికాకుపెడతాయని చెబుతున్నారు.
కాలేయ సమస్యలు:
అరుదైన సందర్భాల్లో, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్‌లు అధికంగా తీసుకుంటే కాలేయ నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఇది సాధారణ గ్రీన్ టీ కంటే సప్లిమెంట్స్‌కు ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది. అంతేకాకుండా అధిక కెఫీన్ కాల్షియం శోషణను తగ్గిస్తుంది. దీంతో దీర్ఘకాలంలో ఎముకల బలహీనత రిస్క్‌ను పెంచే ప్రమాదం ఎక్కువగా ఉంది. గ్నీన్ టీలో కొన్ని ఔషధాల దుష్ప్రభావాలు రావచ్చంటున్నారు.
Also Read: యోగాంధ్రలో మ్యాట్‌లు ఎత్తుకెళ్లిన మహిళలు.. కొట్టుకున్నారు కూడా!
జాగ్రత్తలు:
మితంగా తాగండి: రోజుకు 1-2 కప్పులు సరిపోతాయి.
ఖాళీ కడుపుతో తాగవద్దు: భోజనం తర్వాత లేదా స్నాక్స్‌తో తాగడం మంచిది.
సప్లిమెంట్స్‌తో జాగ్రత్త: గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ సప్లిమెంట్స్‌ను వైద్య సలహా లేకుండా తీసుకోవద్దు.
వైద్య సలహా: గర్భిణీ స్త్రీలు, రక్తహీనత ఉన్నవారు, లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు గ్రీన్ టీ తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి.