OTT Movies : సినీ ప్రియులను ఆకట్టుకోవడం కోసం దర్శకనిర్మాతలు కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. డిఫరెంట్ జోనర్ లో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా హారర్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. మలయాళం, తమిళ సినిమాలను మించి తెలుగులో క్రైమ్ స్టోరీలతో సినిమాలు వస్తున్నాయి.. తాజాగా ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో పర్వాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది. ఆ మూవీ కాన్సెఫ్ట్ కాస్త కొత్తగా ఉంటుంది. ఇక ఓటీటీలో దూసుకుపోతున్న ఆ మూవీ పేరేంటి..? స్టోరీ? ఓటీటీ ప్లాట్ ఫామ్ గురించి ఒకసారి తెలుసుకుందాం..
స్టోరీ విషయానికొస్తే..
ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. మర్డర్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఇది తెరకెక్కింది.. దీని పేరు బ్లైండ్ స్పాట్.. ఈ మూవీ టైం తక్కువగా ఉన్న కూడా దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. జయరామ్ అనే ఒక వ్యాపారవేత్త, తన భార్య దివ్యతో తరచూ గొడవలు పడుతుంటాడు. ఒక రోజు ఆ గొడవ తారా స్థాయికి వెళుతుంది. జయరామ్ భార్యపై చేయి చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే దివ్య తన బెడ్ రూమ్ లో ఉరికి వేలాడుతుంటుంది.. భర్తతో గొడవలు పడడంతోనే ఆత్మహత్య చేసుకుందని అందరూ భావిస్తారు. ఈ ఆత్మహత్య గురించి పోలీసులకు పనిమనిషి సమాచారం అందిస్తుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తారు. అతని ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య అని నిర్ధారణ అవుతుంది. పోలీసులు జయరామ్, అతని సవతి పిల్లలు, పనిమనిషి, జయరామ్ సోదరుడైన ఎన్‌ఐఏ ఆఫీసర్ ను విచారిస్తారు. విచారణలో అందరూ అనుమానితులుగానే కనిపిస్తారు.. కానీ ఏ ఒక్కరూ ఆ హత్య చేయలేదని తేలుతుంది. పనిమనిషితో రహస్య ఎవ్వరు నడుపుతున్న జయరామ్ వల్లే ఈ హత్య జరిగిందని నిర్దారణలో తేలింది. ఆమె మరణానికి అసలు కారకులు ఎవరు? పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని చేదిస్తాడా? క్లైమాక్స్ లో మాత్రం మైండ్ బ్లాక్ లిస్టులో ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకుండా చూస్తేనే స్టోరీ అర్థమవుతుంది..
Also Read :చిరు, బాలయ్య… చిన్న పల్లెటూరుకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు..
అమెజాన్ ప్రైమ్ వీడియో ( Amazon Prime Video )..
బ్లైండ్ స్పాట్ మూవీ అంతా ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది.. పనిమనిషితో ఎఫైర్ పెట్టుకున్న యజమాని తన భార్యను ఎందుకు హత్య చేస్తాడు? ఆ హత్య వెనుక ఏదైన కారణం ఉందా? పోలీసులు చివరికి ఈ కేసుని ఛేదించారా లేదా అన్నది సినిమాలో చూడాలి.. ఈ మూవీ థియేటర్లలో యావరేజ్ టాక్ ని అందుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. జులై 13న ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. క్రైమ్ సినిమాలను ఇష్టపడే వాళ్లు ఈ మూవీని చూసేయ్యొచ్చు.