Vande Bharat Train: సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రైన్‌కు సంబంధించి ఇప్పుడు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటే.. టైమింగ్‌లను మార్చండి అనే మాటే! ఎప్పుడూ వేగంగా వెళుతుంది, అందులో ప్రయాణించడమే గౌరవంగా భావించే ట్రైన్‌కి ఇప్పుడు ప్రయాణీకుల నుండి టైమింగ్‌పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎందుకంటే వీలైన సమయాల్లో ట్రైన్ అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి విశాఖపట్నంకు బయలుదేరే వందే భారత్ ట్రైన్ ఒకటి మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతోంది. ఇది రాత్రి 11.35కి విశాఖపట్నం చేరుతోంది. కానీ చాలాసార్లు ఈ ట్రైన్ ఆలస్యంగా, అర్ధరాత్రి 12 గంటల సమయంలోనే గమ్యస్థానానికి చేరుతోంది. ఇది విశాఖలో రాత్రివేళ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలు లేని ప్రయాణికులకు పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాలవైపు వెళ్లే ప్రయాణికులు ఈ టైమింగ్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఇక మరో వందే భారత్ ట్రైన్ తెల్లవారుజామున 5 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరుతోంది. ఇది మధ్యాహ్నం 1.50కు విశాఖపట్నంకు చేరుతోంది. కానీ ఈ ట్రైన్ ఎక్కాలంటే ప్రయాణికులు ఉదయం 3:30 లేదా 4 గంటలకే ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తోంది. ఇది వయోవృద్ధులకు, కుటుంబాలతో ప్రయాణించేవారికి మరింత ఇబ్బందిగా మారుతోంది. పక్కాగా రవాణా ఉండకపోవడం, ఆ సమయంలో నగరంలో ఆటోలు, క్యాబులు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది చెంది ఇదేదైనా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కాదు కదా.. వందే భారత్ అంటూ వాదిస్తున్నారు.
ఇదే సమయంలో విశాఖ నుండి తిరిగి సికింద్రాబాద్‌కి వెళ్లే ట్రైన్లు కూడా సమయాలను బట్టి ప్రయాణికులపై ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకంగా రాత్రివేళ విశాఖ స్టేషన్ చేరేవారికి అక్కడి నుంచి బస్సులు, ఆర్‌టీసీ సర్వీసులు లేకపోవడం వలనే వారు ప్రయాణాన్ని పూర్తిగా ప్లాన్ చేసుకోవలసి వస్తోంది. అదే విధంగా, స్థానికంగా దూర ప్రాంతాల్లో నివసించే వారు ఇంటికి వెళ్లేందుకు కష్టపడుతున్నారు.
Also Read: Amaravati Gateway: అమరావతి గేట్ వే.. ఇదొక అద్భుతమే.. వారెవ్వా అనేస్తారు!
వీటిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ప్రయాణికులు రాత్రి 10 గంటలలోపు విశాఖ చేరేలా ట్రైన్ టైమింగ్‌లు మారితే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రైల్వే అధికారుల దృష్టికి ఈ అంశం వెళ్లిందని తెలుస్తోంది. ప్రయాణికుల అసౌకర్యాలను అర్థం చేసుకున్న అధికారులు టైమింగ్ మార్పు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం రైలు వేగం, ఖర్చు తక్కువగా ఉండడం, టైంను ఆదా చేయడం వంటివి వందే భారత్ ప్రయాణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నా, టైమింగ్స్‌నే ప్రధానమైన సమస్యగా ప్రయాణికులు చూపుతున్నారు. ముఖ్యంగా పెద్దలు, మహిళలు, చిన్నారులతో ప్రయాణించే కుటుంబాలకైతే వందే భారత్ ప్రయాణమే ఒక వేదనగా మారుతోంది. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేవారికి అర్ధరాత్రి నగరంలో నిలవడానికి గదులు లేకపోవడం, రవాణా లభ్యత లేకపోవడం వల్ల భద్రతా విషయాలు కూడా వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయట.
ఇలాంటి పరిస్థితుల్లో, ప్రయాణికుల వినతులను పరిగణనలోకి తీసుకుని, వందే భారత్ ట్రైన్ల టైమింగ్స్‌ను మరింత ప్రయోజనకరంగా మార్చే దిశగా రైల్వే శాఖ ఆలోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా మరింత మందికి వందే భారత్ ప్రయాణం సులభంగా, సమయోచితంగా మారుతుందని ప్రయాణికులు ఆశిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.