Venu Swamy : వేణు స్వామి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. నిత్యం ఈయన పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టార్ హీరోలను మించి క్రేజ్ ఈయనకు ఉందని చెప్పాలి. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఒక స్టార్ హీరోకి ఉండేటువంటి పేరును సంపాదించుకున్నారు వేణుస్వామి.. సాధారణంగా వ్యక్తుల జాతకాలు చెబితే ఆయనకు పెద్దగా పాపులారిటీ ఉండేది కాదు.. ఇలా సెలెబ్రేటీల వల్లే ఆయన కూడా సెలెబ్రేటీ అయ్యాడు. ఏదొక ఛానెల్ కు ఇంటర్వ్యలు ఇస్తూ కొందరు సెలెబ్రేటిల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తాడు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేణు స్వామి ఎలాంటి విషయాల గురించి మాట్లాడారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
సెలెబ్రేటిలతో ప్రత్యేక పూజలు..
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామీ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరచితమే.. కొన్నాళ్లుగా వేణు స్వామి మరి సంచలనంగా తన ప్రిడిక్షన్ ను వినిపిస్తున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూల్లోనైనా కొద్ది కాలంగా సెలబ్రెటీల గురించి ఎక్కువగా చెడు విషయాలనే చెబుకుంటూ వస్తున్నారు.. ఒకవైపు స్టార్ హీరోయిన్ల తో ప్రత్యేక పూజలు చేయించడమే కాదు. స్టార్ హీరోలను టార్గెట్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ అభిమానుల ట్రోల్స్ కు గురవుతాడు. తాజాగా అలా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆయన ఏమన్నారంటే..
Also Read:బాక్సాఫీస్ ఊచకోత.. రికార్డులను బ్రేక్ చేస్తున్న కలెక్షన్స్..?
పవన్ కళ్యాణ్ పై వేణు స్వామి కామెంట్స్..
వేణు స్వామి రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వేణు స్వామి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ సెలబ్రెటీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది తప్పకుండా జరుగుతుందన చెప్పారు. తను ఊహించి చెప్పిన విషయాలన్నీ ఏమాత్రం పొల్లుపోకుండా జరిగాయని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పై తాజా ఇంటర్వ్యూ లో షాకింగ్ చేశాడు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనాలకు దేవుడి మీద అవగాహన కల్పిస్తున్నారు. వారాహి అమ్మవారిని జనాలకు పరిచయం చేసింది. పవన్ కళ్యాణ్ ఆయన వాహనం పేరు కూడా వారాహి అని పెట్టుకుని అమ్మవారిని ఇష్టం గా ఆరాదిస్తున్నారు. ఆయన చేస్తున్నది మంచి పనే. మాలాంటి వాళ్ళు చెప్తే పదిమంది 20 మంది చూస్తారు. కానీ ఆయన చెప్తే లక్షల మంది ఆయనను ఫాలో అవుతారు. పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని అంతగా పూజించారు. కాబట్టే ఆయనకు అదృష్టం అలా కలిసి వచ్చింది. ఏది పట్టుకున్న సరే మంచే జరుగుతుంది. ఓటమి లేదు అని పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆయన వీడియో వైరల్ అవడంతో మెగా ఫాన్స్ వేణు స్వామి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇన్ని రోజులు విమర్శలు అందుకున్న ఆయన పవన్ కళ్యాణ్ పై మాట్లాడిన మాటలకు ప్రశంసలు దక్కాయి..