BigTV English

Chicken in Summer: చికెన్ ఇలా ఉంటే కొనొద్దు.. వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా డేంజర్!

Chicken in Summer: చికెన్ ఇలా ఉంటే కొనొద్దు.. వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా డేంజర్!

Big Tv Originals: ఈ ఏడాది అప్పుడే ఎండలు మొదలయ్యాయి. మార్చి చివరి వారంలోనే ఉష్ణోగ్రతలు 40°Cకు చేరుకున్నాయి. గతంతో పోల్చితే ఈసారి సమ్మర్ లో సూర్యుడు నిప్పులు కుమ్మరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మర్ చికెన్ తినొచ్చా? తినకూడదా? ఒక వేళ తింటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


సమ్మర్ లో చికెన్ కొనేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు బ్యాక్టీరియా మరింత పెరిగేలా చేస్తాయి. బ్యాక్టీరియా పెరుగుదల కారణంగా చికెన్ త్వరగా చెడిపోతుంది. ఆహార సంబంధిత అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ నేపథ్యంలో తాజా చికెన్ కొనే విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. తాజా, చెడిపోయిన చికెన్ మధ్య తేడాలు ఎలా గుర్తించాలి? వేసవిలో చికెన్ ను సురక్షితంగా ఎలా నిల్వ చేసుకోవాలి? అనేది చూద్దాం..

⦿ వేసవిలో చికెన్ కొనడంలో సవాళ్లు


భారత్ లో చాలా వరకు రోడ్ సైడ్ దుకాణాలలో చికెన్ అమ్ముతారు. సరైన నిల్వ పద్దతులు పాటించరు. వేసవిలో చికెన్ తాజాగా ఉంచడం చాలా కష్టం. తగినంత కూల్ నెస్ తో పాటు సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల సాల్మొనెల్లా, ఇ. కోలి లాంటి బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది.

⦿ వేసవిలో తాజా చికెన్ ఎలా కొనాలి?

వేసవిలో వీలైనంత వరకు అప్పుడే కోసిన మాంసాన్ని తీసుకోవాలి. పరిశుభ్రమైన దుకాణాలు, సూపర్ మార్కెట్లు లేదంటే కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఉన్న దగ్గరే చికెన్ తీసుకోవాలి. చికెన్ సెంటర్లలో రిఫ్రిజిరేటర్లలో గంటల తరబడి నిల్వ ఉంచిన చికెన్ తీసుకోకూడదు. ఒకవేళ ప్యాక్ చేసిన చికెన్‌ను కొనుగోలు చేస్తే, ఫ్రీజర్ లేదంటే కోల్డ్ డి స్‌ప్లేలో ఉంచబడిందో ముందుగా తెలుసుకోవాలి.

⦿ తాజా చికెన్‌ను ఎలా గుర్తించాలి?

తాజా చికెన్ గులాబీ రంగులో ఉంటుంది. బూడిద రంగు, పసుపు రంగు మచ్చలు ఉంటే మంచిది కాదని గుర్తించాలి. తాజాగా చికెన్ తేలికపాటి వాసనను కలిగి ఉంటుంది. నిల్వ ఉన్న చికెన్ కుళ్లిన వాసనను కలిగి ఉంటుంది. చికెన్ గట్టిగా ఉంటే మంచిదని భావించాలి. జిగటగా ఉంటే మంచిది కాదని గుర్తించాలి.  ప్యాకేజింగ్ చికెన్ కొనుగోలు చేస్తే  ‘యూజ్ బై’,  “బెస్ట్ బిఫోర్” తేదీలను తనిఖీ చేయాలి. లీకేజీ లేని చికెన్ ప్యాక్ లను తీసుకోవాలి. ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసిన చికెన్ తీసుకోకూడదు.

⦿ వేసవిలో చికెన్‌ను ఎలా నిల్వ చేయాలి?

వేసవిలో చికెన్ త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చికెన్ 4°C (40°F),  అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత దగ్గర రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి.  1 లేదా 2 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచకూడదు.  ఒకవేళ రెండు రోజులకు మించి నిల్వ చేయాలనుకుంటే ఫ్రీజర్ లో ఉంచాలి.  ఫ్రీజర్ ఉష్ణోగ్రత -18°C (0°F), అంతకంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. చికెన్ చుట్టూ ప్లాస్టిక్ ర్యాప్, ఫ్రీజర్ బ్యాగ్‌లు లేదంటే అల్యూమినియం ఫాయిల్‌ లో గట్టిగా చుట్టాలి.

⦿ చికెన్ ను ప్రత్యేకంగా కట్ చేయాలి!

సాధారణంగా కిచెన్ లో చికెన్ కట్ చేయడం కోసం ప్రత్యేకంగా కటింగ్ బోర్డును ఉపయోగించాలి. కూరగాయలు, పండ్ల కోసం మరొకటి ఉపయోగించుకోవాలి. చికెన్ కట్ చేసే ముందు, చేసిన తర్వాత మీ చేతులు, కత్తుల, కటింగ్ బోర్డులను సబ్బు పెట్టి, వేడి నీటితో కడగాలి.

Read Also:  ఉల్లి గడ్డలను ఇలా అస్సలు తినకండి, లేదంటే క్యాన్సర్ రావడం పక్కా!

⦿ చికెన్‌ను సురక్షితంగా వండాలి

పచ్చి చికెన్ లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు సరైన పద్దతిలో వంట చేయడం మంచిది. చికెన్ ను సాధారణంగా 74°C (165°F)  వరకు వేడి చేయాలి. అప్పుడే చికెన్ సరిగ్గా ఉడుకుతుంది.  చికెన్ ఎల్లప్పుడూ కంప్లీట్ గా ఉడికేలా చూసుకోవాలి. వండిన చికెన్ గది ఉష్ణోగ్రత వద్ద 2 గంటలకు మించి బయట ఉంచకూడదు. అప్పుడే చికెన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Read Also: మొలకెత్తిన ఉల్లిగడ్డలు ఆరోగ్యానికి మంచివేనా? నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×