E-Paper
Advertisement

మైదా లేకుండానే ఇంత క్రిస్పీ సమోసా చేయొచ్చా? ఈ సీక్రెట్ తెలిస్తే ఇక బయట అస్సలు కొనరు!

మైదా లేకుండానే ఇంత క్రిస్పీ సమోసా చేయొచ్చా? ఈ సీక్రెట్ తెలిస్తే ఇక బయట అస్సలు కొనరు!
Advertisement

Ragi Samosa Recipe: సమోసా అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మైదా పిండి. కానీ మైదా ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసినా.. ఆ రుచిని వదులుకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం ఈ రాగి సమోసా బెస్ట్ ఛాయిస్. కేవలం రుచి మాత్రమే కాదు.. ఇందులో వాడే రాగి పిండి వల్ల ఎముకలకు బలం, శరీరానికి కావాల్సిన ఫైబర్ పుష్కలంగా అందుతాయి. పైగా దీని తయారీ కూడా చాలా సులభం. లోపల స్పైసీ ఆలూ స్టఫింగ్, పైన క్రిస్పీగా ఉండే రాగి లేయర్‌తో అచ్చం బేకరీ స్టైల్‌లో ఉండే ఈ హెల్తీ సమోసాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

రాగి పిండి – ఒక కప్పు
గోధుమ పిండి – అర కప్పు
ఉడికించిన బంగాళాదుంపలు – మూడు
ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి – మూడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్
పచ్చి బఠానీలు – పావు కప్పు
ధనియాల పొడి – ఒక టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
ఆమ్‌చూర్ పొడి – అర టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
వాము – చిటికెడు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నూనె – వేయించడానికి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా

Advertisement

Also Read: ఒక్క సిప్ తాగితే చాలు మైమరచిపోవాల్సిందే.. ఈ స్పైసీ చికెన్ సూప్ సీక్రెట్ ఇదే!

తయారీ విధానం ఇలా:

ఒక వెడల్పాటి గిన్నెలో రాగి పిండి, గోధుమ పిండి, చిటికెడు వాము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో రెండు స్పూన్ల వేడి నూనె వేసి పిండిని రవ్వలా అయ్యేంత వరకు చేతితో నలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకొని, పైన తడి బట్ట కప్పి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి.

Advertisement

ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు కలపాలి. ఇప్పుడు ఉడికించిన బఠానీలు, మెదిపిన బంగాళాదుంపల మిశ్రమం, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్‌చూర్ పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

నానబెట్టుకున్న రాగి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, చపాతీలా గుండ్రంగా ఒత్తుకోవాలి. దాన్ని మధ్యలోకి సగానికి కట్ చేసి, ఒక భాగాన్ని కోన్ ఆకారంలో మడవాలి. అంచులు విడిపోకుండా నీళ్లతో తడిపి గట్టిగా అతికించాలి. ఆ కోన్‌లో చల్లారిన బంగాళాదుంప మసాలాను నింపి, పైన అంచులను కూడా నీళ్లతో తడిపి మూసివేయాలి. ఇలా అన్ని సమోసాలను సిద్ధం చేసుకోవాలి.

చివరగా స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె మీడియం వేడిలో ఉన్నప్పుడు తయారు చేసుకున్న సమోసాలను వేసి, మంటను తక్కువగా ఉంచి రెండు వైపులా మంచి రంగు వచ్చేవరకు, కరకరలాడేలా వేయించుకోవాలి. అంతే.. ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన వేడివేడి రాగి సమోసాలు సిద్ధం అయినట్టే. వీటిని పుదీనా చట్నీ లేదా టమోటా సాస్‌తో తింటే ఆహా అనాల్సిందే.

Also Read: అర్ధరాత్రి స్వీట్ క్రేవింగ్స్ తీర్చే ఇన్‌స్టంట్ ‘ఎమర్జెన్సీ చాక్లెట్ కేక్’.. ఓవెన్ లేకుండా 10 నిమిషాల్లోనే రెడీ!

Tags

Related News

ముక్కుపై బ్లాక్‌హెడ్స్‌తో ఇబ్బందిగా ఉందా? ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

రోజూ తినే ఎగ్ కర్రీ బోర్ కొట్టిందా?అయితే ఈ మెంతి కోడిగుడ్డు కూర ట్రై చేయండి!

మినప అప్పడాలు..ఇలా చేస్తే బయటి వాటి కంటే మంచి రుచి!

అమ్మమ్మల కాలం నాటి బీరకాయ రోటి పచ్చడి..సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ!

చాక్లెట్లు, బొమ్మల ఆశ చూపించి పిల్లలను మోసం చేసే వారితో జాగ్రత్త.. తల్లిదండ్రులు ఈ 7 విషయాలు నేర్పాలి

మీకు తెలుసా నెమళ్లు విషపూరిత పాములను చంపి తిన్నా చనిపోవు.. ఎందుకంటే

తొలి పరిచయంలోనే ఆకట్టుకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఆకర్షణ ఎక్కువ

విదుర నీతి.. ఈ 4 గుణాలు ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి వస్తుంది.. డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు?

Big Stories

Advertisement
×