Summer Diet: ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తున్నామనే విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. ముఖ్యంగా ఎండాకాలంలో చిన్నారులకు ఇచ్చే ఆహారం మంచిదా కాదా అనేది తప్పకుండా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి కాలం రాగానే గాలిలో వేడిమి పెరిగి, శరీరంలో నీటి మోతాదు తగ్గిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో వారు ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం.
వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు చిన్న పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష, వాటర్ మెలన్, మస్క్ మెలన్, మామిడిపండ్లు, నారింజ, జ్యూస్‌ల వంటి వాటిని ఎక్కువగా పిల్లలకు ఎక్కువగా ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్‌తో పాటు అనేక పోషకాలు అందుతాయట. తరచూ పండ్లను సలాడ్ రూపంలో ఇస్తే వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
వేసవిలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం. సాధారణ నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి వాటిని చిన్న పిల్లలకు తరచూ ఇవ్వాలి. కొబ్బరి నీరులో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది డీహైడ్రేషన్ సమస్య రాకుండా చేయడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే శరీరానికి భారంగా అనిపించవచ్చట. అందుకే చిన్న పిల్లలకు తేలికపాటి ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అన్నంతో పాటు పిల్లలకు పెరుగును తప్పక ఇవ్వాలి. పెరుగు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసా?
స్నాక్స్ తినడానికని చిన్న పిల్లలు చాలా ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందకే ఫ్రూట్ క్యూబ్స్, కూల్ ఫ్రూట్ జెల్లీలు, యోగర్ట్ పాప్‌సికల్స్, ఐస్ ఫ్రూట్ బార్స్ వంటి వాటిని ఇంట్లో తయారు చేసి ఇవ్వొచ్చు. వీటిలో షుగర్, ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో పిల్లలు ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో గడిపే అవకాశం ఉంది. దీని వల్ల ఆకలి తగ్గే పరిస్థితులు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయంలో ఆహారాన్ని చిన్నచిన్న మోతాదుల్లో, తరచుగా ఇవ్వడం మంచిది. వేయించిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ఆయిల్ ఫుడ్స్‌తో పాటు ప్రాసెస్‌డ్ ఫుడ్‌లను ఇవ్వడం పూర్తిగా మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
పిల్లల ఎదుగుదల కోసం ప్రోటీన్లు చాలా అవసరం. ఉదయాన్నే గుడ్డు, పాలు, పండ్లు ఇవ్వడం వల్ల రోజంతా పిల్లలు శక్తివంతంగా ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల చిన్నారులను ఎండ వేడిమి నుంచి కాపాడడం మరింత ఈజీ అవుతుందని అంటున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.