MGTBC Admissions: ఇంటర్ పూర్తి చేసే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సోసైటీ (ఎంజీటీబీసీ) లో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు అప్లికేషన్ లు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్ గురించి క్లియర్ కట్ గా వివరాలను తెలుసుకుందాం.
హైదరాబాద్, మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (ఎంజీటీబీసీ) 2025-2026 ఎడ్యుకేషనల్ ఇయర్ కు సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. మే 5 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హత: అభ్యర్థులు ఇంటర్మీడియట్ లో 50 శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి. అల్రెడీ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: ఏప్రిల్ 16 (నిన్నటి నుంచే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది)
దరఖాస్తుకు చివరి తేది: మే 5 (మే 5న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.)
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీలో పలు రకాల కోర్సులు ఉంటాయి. బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీఏ, బీఎఫ్‌టీ, బీహెచ్‌ఎంసీటీ కోర్సులు ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ: ఇంటర్ అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: దోస్త్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.225 ఉంటుంది. మెయింటెనెన్స్ ఛార్జెస్ రూ.1000 ఫీజు ఉంటుంది. కాషన్ డిపాజిట్ రూ.1000 ఫీజు ఉంటుంది.
కోర్సు ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా కోర్సులో ఎంపిక ఉంటుంది.
అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ వెంటనే ఈ కోర్సులకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీలో పలు రకాల కోర్సులు ఉంటాయి. బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీఏ, బీఎఫ్‌టీ, బీహెచ్‌ఎంసీటీ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
దరఖాస్తుకు చివరి తేది: మే 5
Also Read: IDBI Recruitment: ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతోనే జాబ్.. ఇంకా 3 రోజులే గడువు మిత్రమా..!