Healthy Foods For Children: పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి పోషకాహారం చాలా ముఖ్యం. నేటి పోటీ వాతావరణంలో, పిల్లలు షార్ప్‌గా ఉంటేనే వారి చదువు, ఇతర కార్యకలాపాలలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సరైన ఆహారపు అలవాట్లు, పోషకాహారం ద్వారా పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచవచ్చు. పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు తినిపించాల్సిన 5 ఆహార పదార్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. బాదం:
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఈ 5 రకాల ఫుడ్స్ తప్పకుండా పిల్లలకు తినిపించండి. పిల్లల మెదడు పని తీరును మెరుగుపరచడంలో బాదం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడును చురుకుగా , పదునుగా చేస్తాయి. నానబెట్టిన 2-3 బాదంపప్పులను ఉదయం పిల్లలకు తినిపిస్తే వారి జ్ఞాపకశక్తి బలపడుతుంది.
2. వాల్నట్స్:
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఈ 5 రకాల ఆహార పదార్థాలు తప్పకుండా తినిపించండి. వాల్నట్ ఆకారం మెదడులా ఉంటుంది. ఇది మీ మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. పిల్లలకు రోజు 1-2 వాల్‌నట్‌లను తినిపించండి. తద్వారా వారి మెదడు మెరుగ్గా పనిచేస్తుంది.
3. పాలు, పాల ఉత్పత్తులు:
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించే ఆహారాల్లో పాలు చాలా ముఖ్యమైంది. పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ప్రతి రోజు పాలు తప్పకుండా త్రాగించాలి. పాలు, పెరుగు, జున్ను , నెయ్యి వంటి వాటి ఉత్పత్తులు పిల్లల మానసిక సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. పాలలో ప్రోటీన్, కాల్షియం , విటమిన్ B12 ఉంటాయి. ఇవి న్యూరోట్రాన్స్మిటర్ల ఏర్పాటులో సహాయపడుతాయి. పిల్లలకు ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగడం అలవాటు చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా పిల్లల మెమరీ పవర్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
4. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్:
ఆకుపచ్చ కూరగాయలు అంటే బచ్చలికూర, మెంతి , బ్రకోలీ వంటివి పిల్లల మెదడును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పదునుగా చేస్తాయి. వీటిలో ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు కణాలను చురుకుగా ఉంచుతాయి. ఈ కూరగాయలను సూప్, పరాటా లేదా కూరగాయల రూపంలో పిల్లలకు తినిపించండి.
5. పండ్లు:
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి పండ్లు తప్పకుండా తినిపించండి. ముఖ్యంగా బ్లూబెర్రీ, నారింజ, ఆపిల్ , దానిమ్మ వంటి పండ్లు పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ పండ్లలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడును మెరుగుపరుస్తాయి. పిల్లలకు రోజు కనీసం ఒక సీజనల్ ఫ్రూట్ తప్పకుండా తినిపించండి.
Also Read: వీళ్లు గోరువెచ్చని నీరు అస్సలు త్రాగకూడదు
పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో సమతుల్య ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, వారి ఆహారంలో పైన పేర్కొన్న 5 పదార్తాలను తప్పకుండా చేర్చండి. అలాగే చదువులోనూ, క్రీడల్లోనూ వారిని చురుగ్గా ఉంచడం వల్ల వారి మనసు పదునుగా ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యకరమైన మెదడుకు కీలకం.