Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 22న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు స్తిరాస్థుల క్రయవిక్రయాలలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధు వర్గం నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.
వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికి నచ్చుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికామవుతాయి. బంధువులతో ఆకారణ విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేసుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. పనులలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు తప్పవు.
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. నూతన రుణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.
మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆదాయ మార్గలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?