Henna For Hair: హెన్నాను చాలా మంది జుట్టుకు ఉపయోగిస్తున్నారు.హెన్నా జుట్టుకు అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా, షైనీగా మారి చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే హెన్నాను జుట్టుకు పట్టించే ట్రెండ్ చాలా కాలంగా కొనసాగుతోంది. మీరు కూడా మీ జుట్టును బలంగా, మెరిసేలా చేయాలనుకుంటే మాత్రం హెన్నాను అప్లై చేయడం అస్సలు మరిచిపోవద్దు. దీని వల్ల మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హెన్నా జుట్టును మందంగా చేస్తుంది. హెన్నా జుట్టుకు అప్లై చేసే విధానంతో పాటు హెన్నా యొక్క మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెన్నా యొక్క ప్రయోజనాలు:
హెన్నా జుట్టును ఒత్తుగా, అందంగా మారుస్తుంది.
హెన్నా జుట్టును బలపరుస్తుంది.
దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, షైనీగా మారుతుంది.
ఇది చుండ్రును వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.
జుట్టు నల్లగా మారుస్తుంది.
తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడానికి హెన్నా ఉపయోగపడుతంది.దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టుకు ఎలాంటి నష్టం జరగదు. అంతే కాకుండా ఎంతటి తెల్ల జుట్టు అయినా నల్లగా మార్చడంలో ఉపయోగపడుతువది.పార్లర్, సెలూన్‌లో జుట్టుకు రంగు వేయించుకోవడానికి బదులుగా ఇంట్లోనే హెన్నాను అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. హెన్నాను జుట్టుకు అప్లై చేయడం కోసం ముందుగా జుట్టుకు తగినంత హెన్నా పౌడర్ తీసుకుని అందులో డికాషన్ వేసి, రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం, హెన్నాను జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. దీని తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోండి.
పొడి , నిర్జీవమైన జుట్టు అస్సలు అందంగా కనిపించదు. ఈ సమస్య తొలగిపోవాలంటే హెన్నాను అప్లై చేయడం మంచిది. జుట్టును మృదువుగా మార్చడంలో హెన్నా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది జుట్టుకు పోషణను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే మీ జుట్టు మెరిసేలా, మృదువుగా మారడానికి హెన్నాను అప్లై చేయండి. కావాలంటే ఉసిరి పొడిని కూడా ఇందులో హెన్నాలో కలిపి వాడవచ్చు.
Also Read: ఈ హెయిర్ ఆయిల్స్ వాడితే.. జుట్టు బాగా పెరుగుతుంది తెలుసా ?
జుట్టు బలంగా మారుతుంది:
జుట్టును ఆరోగ్యంగా , ఒత్తుగా మార్చడంలో హెన్నా సహాయపడుతుంది. జుట్టుకు బలాన్ని ఇవ్వడంతో పాటు అందంగా మారుస్తుంది. హెన్నాలో ఎగ్ కూడా వేసి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్ ఉంటుంది. ఇది జుట్టును ఒత్తుగా మార్చడంలో సహాయపడుతుంది.
చుండ్రు నయమవుతుంది:
చుండ్రు జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. దీని కారణంగా జుట్టు రాలడం పెరుగుతుంది. అంతే కాదు, చుండ్రు కారణంగా దురద కూడా పెరుగుతుంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే హెన్నాను అప్లై చేయండి. తరుచుగా జుట్టుకు హెన్నా అప్లై చేయడం వల్ల చుండ్రు చాలా వరకు తగ్గుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.