Srinu Vaitla about Pawan Kalyan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ల ప్రస్తావన వస్తే శ్రీనువైట్ల పేరు కూడా వినిపించేది. చాలామంది దర్శకులు కంటే కూడా శ్రీనువైట్ల తన కెరీర్ లో ఎక్కువమంది స్టార్ హీరోలతో పనిచేసారు. కేవలం ఇప్పుడు స్టార్ హీరోస్ మాత్రమే కాకుండ సీనియర్ స్టార్ హీరోస్ తో కూడా పనిచేసిన ఘనత శ్రీనువైట్లకే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ వంటి దర్శకులకి దక్కని అరుదైన అవకాశం కూడా శ్రీనువైట్లకి దక్కింది. అదే మెగాస్టార్ తో సినిమా చేయటం. ఇకపోతే శ్రీను వైట్ల కెరియర్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సినిమా దూకుడు. మహేష్ బాబు కెరీర్ కి ఆ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది.
ఇక శ్రీను వైట్ల సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీను వైట్ల స్ట్రెంత్ కామెడీ. శ్రీను వైట్ల సినిమాలలో కామెడీ చాలా నేచురల్ గా ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ లో శ్రీను వైట్ల లాంటి దర్శకులు లేరు అని చెప్పాలి. సీరియస్ కథని కూడా కామెడీ యాంగిల్ లో చెబుతూ సక్సెస్ అయ్యాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యాడు శ్రీను వైట్ల. అయితే అప్పట్లో శ్రీను వైట్ల మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో నేను ఎప్పటి నుంచో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాను ఆ విషయం ఆయన కూడా తెలుసు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ కి వాస్తవంగా శ్రీను వైట్ల కొన్ని సంవత్సరాల క్రితం ఒక కథను చెప్పారట. ఆ కథ కూడా కామెడీ జోనర్ లోనే ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఆ కథను విన్నప్పుడు తనకొక సోషల్ మెసేజ్ ఉన్న కథ కావాలి అని అడిగారట అందువలన ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
Also Read : Pusha 2: పుష్ప టీం కు బ్లాక్ మెయిల్.. ట్రైలర్ అప్డేట్ ఇస్తావా, సూసైడ్ చేసుకోవాలా
ఇకపోతే పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ లోని కామెడీ టైమింగ్ చూసి తను ఆనందం సినిమాలో కామెడీ ట్రాక్ రాశాను అని రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు శ్రీనువైట్ల. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కామెడీ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ్ముడు ఖుషి వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కామెడీ ఆపేసి సీరియస్ రోల్ లో సినిమాలు చేయటం మొదలుపెట్టారు. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు పవన్ కళ్యాణ్. ఇక శ్రీను వైట్ల కూడా రీసెంట్ గా విశ్వం సినిమాతో ఒక యావరేజ్ సక్సెస్ అందుకున్నారు. గత కొన్నేళ్లుగా వస్తున్న శ్రీను వైట్ల సినిమాలన్నిటికంటే విశ్వం సినిమా పరవాలేదు అనిపించుకుంది.