BigTV English

Herbal Tea: నిద్ర పట్టడం లేదా ? అయితే ఇలా చేయండి !

Herbal Tea: నిద్ర పట్టడం లేదా ? అయితే ఇలా చేయండి !

Herbal Tea: ఆరోగ్యంగా ఉండటానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. రోజువారీ పనులతో బిజీగా గడిపిన తర్వాత.. ప్రతి ఒక్కరూ రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను కోరుకుంటారు. కానీ తరచుగా నిద్రలేమితో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఆందోళన, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, మందుల వాడకం వల్ల నిద్ర లేమి సమస్యను ఎదుర్కుంటారు. ఇలాంటి సమయంలోనే మంచి నిద్ర కోసం క్రమబద్ధమైన లైఫ్ స్టైల్ అనుసరించడం చాలా ముఖ్యం. దీంతో పాటు.. నిద్రపోయే విధానం కూడా చాలా ముఖ్యం.


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్రపోయే ముందు టీ, కాఫీ తాగడం మానేయాలి. కానీ మీకు తెలుసా ? కొన్ని హెర్బల్ టీలు తాగడం వల్ల రాత్రి బాగా నిద్రపోవచ్చు. మరి ఎలాంటి హెర్బల్ టీలు నిద్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

6 రకాల హెర్బల్ టీలు నిద్రను మెరుగుపరుస్తాయి. వీటిని తాగడం వల్ల మీరు బాగా నిద్రపోవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. వీటిని తరచుగా తాగడం వల్ల మనసుతో పాటు శరీరం కూడా రిలాక్స్ అవుతుంది.


నిమ్మ  టీ:
ఈ టీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి.. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. ఈ హెర్బల్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఈ టీ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి నిమ్మకాయ పనిని సులభతరం చేస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. అంతే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పుదీనా టీ :
పుదీనా లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కెఫిన్ లేని పుదీనా టీ మనసును ప్రశాంతంగా చేస్తుంది. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది ఏ రకమైన ఇన్ఫెక్షన్‌తోనైనా పోరాడటానికి సహాయపడుతుంది. ఈ టీ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. దీనిని తాగడం వల్ల కండరాలు కూడా సడలించబడతాయి. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది.

చమోమిలే :
చమోమిలే హెర్బల్ టీ తాగడం వల్ల మీకు చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. అంతే కాకుండా ఇది మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇది శరీరంలో మంటను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

లావెండర్:
లావెండర్ టీ దాని తాజా లేదా ఎండిన పువ్వులతో తయారు చేస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీన్ని తరచుగా తాగడం వల్ల మెరుగైన నిద్ర, మెరుగైన జీర్ణక్రియ, ఆరోగ్యకరమైన మెరిసే చర్మం, తలనొప్పి నుండి ఉపశమనం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

Also Read: ఇంట్లోనే.. సన్ స్క్రీన్ తయారు చేసుకుందామా ?

మాగ్నోలియా :
ఈ హెర్బల్ టీ తాగడం వల్ల మీ నిద్ర మెరుగుపడటమే కాకుండా ఈ టీ ఆందోళన , నిరాశను కూడా తగ్గిస్తుంది. ఈ టీని మాగ్నోలియా మొక్క యొక్క బెరడు, మొగ్గలు, కాండం నుండి తయారు చేస్తారు. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుంది. అంతే కాకుండా నిద్ర లేమి సమస్యను తొలగిస్తుంది.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×