Nikhil The india House: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ (Nikhil) తాజాగా నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ సాఫీగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా ప్రమాదం చోటుచేసుకుంది. ఇక ఈ ప్రమాదం సమయంలో చోటు చేసుకున్న సంఘటనపై తాజాగా ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందించారు. ఇకపోతే ప్రమాదం జరిగిన సమయంలో షూటింగ్ స్పాట్ లోనే హీరో నిఖిల్ కూడా ఉన్నారు. అయితే ప్రమాదానికి ముందు షార్ట్ బ్రేక్ లో నిఖిల్ పక్కకు వెళ్లిపోయి, ప్రమాదం నుండి బయటపడ్డారు. ఆ సమయంలో కెమెరా అసిస్టెంట్ కాళ్లు విరగడంతో వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు యూనిట్ సభ్యులు. ఇక ఈయనతో పాటు మరో ఇద్దరికి గాయాలైనట్లు నిర్మాత అభిషేక అగర్వాల్ (Abhishek Agarwal) చెబుతూ.. సెట్ లో జరిగిన ప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ సన్నివేశం తీసేటప్పుడే ఈ ప్రమాదం..
అసలు విషయంలోకి వెళ్తే.. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంకు పగిలిపోవడంతోనే ఒక్కసారిగా సెట్ లోకి నీళ్లు ముంచెత్తాయి. దీంతో పలువురు సిబ్బందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. సామాగ్రి మొత్తం నీటిలో తడిసిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే అటు అభిషేక్ అగర్వాల్ కూడా సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదాన్ని ధృవీకరించారు.
ది ఇండియన్ హౌస్ సినిమా విశేషాలు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)సమర్పణలో నిఖిల్ హీరోగా, సయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్ గా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది ఇండియా హౌస్. రామ్ వంశీకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam kher)కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే నిఖిల్ గతంలో నటించిన ‘కార్తికేయ 2’ సినిమాలో కూడా ఈయన కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో భాగం అవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. 1905 నేపథ్యంలో ప్రేమా విప్లవం అంశాలతో నిండిన ఆసక్తికర కథాంశం తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ సెట్లో ఇప్పుడు ఇలా ప్రమాదం చోటు చేసుకోవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Rana Daggubati: బాబాయ్ వెంకీ పై రానా బూ*తులు.. అందుకే అలా చేశానంటూ క్లారిటీ!