నెయ్యి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నెయ్యి వాసన వస్తే చాలు తినేయాలన్న కోరిక పుడుతుంది. పప్పులో కాసింత నెయ్యి వేసుకుంటే ఆ రుచే వేరు. కారంగా ఉండే ఆవకాయలో నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే బిర్యానీ, పులావ్… ఏది వండిన రెండు స్పూన్ల నెయ్యి పడాల్సిందే. అయితే ఇలా ఆహారలో కలుపుకొని తినే కన్నా పరగడుపున అంటే ఖాళీ పొట్టతో ఒక స్పూను నెయ్యి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
నెయ్యిని పూర్వీకులు మనకు అందించిన నిధిగా చెప్పుకోవాలి. దాని రుచికి, ఆరోగ్య ప్రయోజనాలకు మనం ఎంతో రుణపడి ఉండాలి. నిజానికి నెయ్యి వల్ల బరువు పెరుగుతారని చెప్పుకుంటారు. రోజుకో స్పూన్ నెయ్యి తినడం వల్ల ఆరోగ్యమే, కానీ ఎలాంటి బరువు పెరగరు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం ఖాళీ పొట్టతో నెయ్యి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.
జీర్ణ ఆరోగ్యం
ఖీళీ పొట్టతో నెయ్యి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతి ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసుకుని ఒక స్పూన్ నెయ్యి కరిగించి తినేందుకు ప్రయత్నించండి. ఇది పొట్ట ఉబ్బరం., గ్యాస్టిక్ సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఎందుకంటే నెయ్యి పొట్టలోని ఆమ్లాల స్రావాలను ప్రేరేపిస్తుంది. దీని వల్ల జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది. మనం తినే ఆహారం విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలు రావు.
డిటాక్సిఫికేషన్
శరీరాన్ని అప్పుడప్పుడు డీటాక్సిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరంలో హానికరమైన విషాలు, వ్యర్ధాలు పేరుకు పోతాయి. వాటిని శుభ్రపరచుకోవాలంటే నెయ్యిని తినడం ద్వారా లాభాలు పొందవచ్చు. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి అగ్నిని రగిలిస్తుంది. అంటే జీర్ణవ్యవస్థలో అగ్నిని మండిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపడంలో ఉపయోగపడుతుంది. నెయ్యిలో బ్యూటిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఇది పెద్ద పేగు కణాలకు కీలక శక్తి వనరు.
పేగు ఆరోగ్యానికి
పేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా నెయ్యి ముందుంటుంది. నెయ్యి శరీరాన్ని డీటెక్సిఫికేషన్ కు గురిచేస్తుంది. ఇది మీ పేగులను కాపాడుతుంది. పేగులు ఆరోగ్యంగా లేకపోతే పొట్ట సమస్యలు అధికంగా వస్తాయి. ప్రతిరోజు నెయ్యి తీసుకుంటే మీ పేగుల పొరలు ఆరోగ్యంగా ఉంటాయి. పేగులో కదలికలు కూడా చురుగ్గా ఉంటాయి. కాబట్టి మలబద్ధకం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువ. చెడు ఆహారపు అలవాట్ల వల్ల మన పేగులలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. దీనివల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు నెయ్యిని పరగడుపున తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.
Also Read: బ్లాక్ కాఫీ తాగుతున్నారా ? అయితే డెంజర్‌లో పడ్డట్లే
నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతామని ఎంతోమంది అనుకుంటారు. అధికంగా నెయ్యి తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. కానీ ఒక స్పూన్ నెయ్యి ప్రతిరోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా నెయ్యిలో మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి ఎంతో సహాయపడతాయి. రోజు పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తినేందుకు ప్రయత్నించండి. కేవలం నెల రోజుల్లో మీకు మంచి మార్పులు కనిపిస్తాయి.