Rachin Ravindra: పాకిస్తాన్ లో వన్డే సిరీస్ ఆడుతున్న న్యూజిలాండ్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఛాంపియన్ ట్రోఫీ కంటే ముందు న్యూజిలాండ్ యంగ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర ( Rachin Ravindr ) కు తీవ్ర గాయం అయింది. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో ఈ యంగ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర ( Rachin Ravindr ) తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ… రచిన్ రవీంద్ర గాయాల పాలు కావడం జరిగింది. పాకిస్తాన్ ఆటగాడు కుష్ దిల్ భారీ షాట్ ఆడగా… ఆ బంతిని క్యాచ్ పట్టుకునేందుకు రచిన్ రవీంద్ర ( Rachin Ravindr ) ప్రయత్నం చేశాడు.
Also Read: Champions Trophy 2025: PCBపై రిజ్వాన్ తిరుగుబాటు..యాక్షన్ తీసుకోనున్న ఛైర్మన్ నఖ్వీ ?
అయితే… ఇక్కడే దురదృష్టం… రచిన్ రవీంద్ర ( Rachin Ravindr ) ను వెంటాడింది. ఆ బంతి వేగంగా వచ్చి… రచిన్ రవీంద్ర ( Rachin Ravindr ) ముఖానికి బలంగా తాకింది. ఇంటర్నేషనల్ క్రికెట్ బంతి కావడంతో… రచిన్ రవీంద్ర ముఖం నుంచి రక్తం కారడం మొదలైంది. దీంతో అక్కడే కుప్పకూలాడు రచిన్ రవీంద్ర ( Rachin Ravindr ). అయితే ఇది గమనించిన ఫిజియోలు వెంటనే గ్రౌండ్ లోకి చేరుకొని… అతన్ని… డగౌట్ లోకి తీసుకువెళ్లారు. అనంతరం రచిన్ రవీంద్ర ( Rachin Ravindr )ను … ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లు సమాచారం అందుతుంది. ఫ్లడ్ లైట్… వెలుతురు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బాల్ సరిగా కనిపించలేదట.
ఈ తరుణంలోనే ఆ బంతి వచ్చి రచిన్ రవీంద్ర ( Rachin Ravindr ) ముఖం పైన పడింది. దీంతో రక్తస్రావం విపరీతంగా చోటుచేసుకుంది. అయితే రచిన్ రవీంద్ర ( Rachin Ravindr ) ఎపిసోడ్ తర్వాత మళ్లీ మ్యాచ్ మొదలైంది. తీవ్రంగా గాయపడ్డ రచన్ రవీంద్ర వెంటనే కోలుకోవాలని… ఇండియన్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య… ఇవాళ మొదటి వన్డే జరుగుతోంది. ఈ రెండు జట్ల మధ్య గడాఫీ స్టేడియం వేదికగా… తొలి పోరు ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైంది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు… పాకిస్తాన్ పై ఆధిపత్యం చెలాయించి 78 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 330 పరుగులు చేసింది.
ఇందులో గ్లెన్ ఫిలిప్స్… అద్భుతంగా రాణించి పాకిస్తాన్.. మెడల్ వంచాడు. ఈ మ్యాచ్ లో 74 బందుల్లోనే 106 పరుగులు చేసి దుమ్ము లేపాడు గ్లెన్ ఫిలిప్స్. ఇందులో ఆరు బౌండరీలు అలాగే ఏడు సిక్సర్లు ఉన్నాయి. అటు డారైల్ మీచల్ కూడా 81 పరుగులు చేసి రాణించాడు. అటు కేన్ విలియంసన్… 58 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే కెప్టెన్ లాతం మాత్రం డకౌట్ అయ్యాడు. అనంతరం చేజింగ్ కు దిగిన పాకిస్తాన్ జట్టు 47.5 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది. 252 పరుగులు చేసిన పాకిస్తాన్… దారుణంగా ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ లో 78 పరుగులు తీయడంతో న్యూజిలాండ్ విజయం సాధించింది.
Also Read: Sreesanth- Sanju: సంజు పంచాయితీ… కేరళ క్రికెట్ ను గెలికిన వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ ?
Prayers for Rachin Ravindra 🙏🏻
Bleeding now.
He tried to catch the ball, It hits Straight to his Head! 💔pic.twitter.com/ph9oeXXUTo— Total Cricket (@TotalCricket18) February 8, 2025