BigTV English

Yoga for Men: అబ్బాయిలూ.. మీలో ఆ పవర్ పెరగాలా? ఈ ఆసనం వెయ్యండి, మీరే కింగ్!

Yoga for Men: అబ్బాయిలూ.. మీలో ఆ పవర్ పెరగాలా? ఈ ఆసనం వెయ్యండి, మీరే కింగ్!

పురుషులు బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని యోగా భంగిమల ద్వారా కండరాల పెరుగుదల, కండరాల శక్తి మెరుగుపడతాయి. ఇక మగవారిలో లైంగిక శక్తిని పెంచే టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవ్వడానికి కూడా కొన్ని యోగాసనాలు ఎంతగానో సహాయపడతాయి. పురుషులు శక్తివంతమైన లైంగిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలంటే ప్రతిరోజూ కొన్ని రకాల యోగాసనాలను ప్రాక్టీస్ చేయాలి.


పురుషుల ఆరోగ్యానికి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎంతో ముఖ్యం. ఇది కండరాలను నిర్మించడానికి సహాయపడుతుంది. అలాగే శక్తిని అందిస్తుంది. వారి మానసిక స్థితిని సరిగా ఉండేలా సపోర్ట్ చేస్తుంది. యోగా ద్వారా మీరు టెస్టోస్టోరాన్ స్థాయిలను సమతుల్యంగా ఉండేలా చూసుకోవచ్చు. ఈ హార్మోన్ శరీరంలో సరిపడినంత ఉత్పత్తి అయితేనే ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి రక్తప్రవాహం మెరుగుపడుతుంది. శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.

1. భుజంగాసనం
దీన్నే కోబ్రా పోజ్ అని కూడా పిలుస్తారు. పురుషులకు ఉత్తమమైన యోగా భంగిమలలో ఇది కూడా ఒకటి. ఇది ఛాతీని సాగేలా చేస్తుంది. వెనుక భాగాన్ని కూడా బలపరుస్తుంది. శరీరానికి తగినంత టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.


1. మీరు యోగా మ్యాట్ మీద బోర్లా పడుకోండి.
2. మీ అరచేతులను నేలపై ఉంచి శ్వాస తీసుకుంటూ మీ శరీరాన్ని పైకి లేపండి.
3. నడుము వరకు శరీరాన్ని పాములాగా పైకి లేపి మిగతా కాళ్ల భాగాన్ని నేలపైనే ఉంచండి.
4. ఈ భంగిమలో కొన్ని సెకన్ల పాటూ ఉండండి. ఆపై నెమ్మదిగా ప్రారంభ స్థానానికి రండి.
5. తిరిగి ఇదే పద్ధతిలో ఆసనాన్ని వేస్తూ ఉండండి .

ఈ భుజంగాసనం వేయడం వల్ల శ్వాసకోశ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. టెస్టోస్టిరాన్ ని ఉత్పత్తి చేసే వృషణాలు, అడ్రినల్ గ్రంధులు అద్భుతంగా పనిచేస్తాయి. వెన్నుముకకు బలాన్ని అందిస్తాయి.

2. వీరభద్రాసనం 2
దీన్నే వారియర్ 2 పోజ్ అని కూడా పిలుస్తారు. ఇది యోగాలో ఒక ముఖ్యమైన భంగిమ. ఇది కాళ్లు, తుంటి, భుజాలను బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రతను పెంచుతుంది. ఈ ఆసనానికి శివుని యోధుని రూపమైన వీరభద్రుని పేరు మీద పెట్టారు.

1. ఈ ఆసనం చేయడానికి నేలపై నిలబడండి. కాళ్ళను వెడల్పుగా సాగదీయండి.
2. కుడికాలుని 90 డిగ్రీలకు తిప్పండి. కుడి మోకాలు 90 డిగ్రీలు వంగి ఉండేలా చూసుకోండి.
3. మీ రెండు చేతులను రెండు పక్కలకూ చాపండి.
4. మీ తలను కుడివైపుకు తిప్పి కుడి చేతి వైపుగా చూడండి.
5. ఈ భంగిమలో 30 సెకన్ల నుండి నిమిషం వరకు ఉండండి.
6. నెమ్మదిగా ప్రారంభ స్థితికి తిరిగి రండి. ఇదే విధంగా ఎడమవైపు కూడా చేయండి.

ఈ ఆసనం వేయడం వల్ల భుజాలు, చేతులు, కాళ్లు, తుంటి వెనుక భాగం బలపడతాయి. శరీర సమతుల్యత కూడా బలపడుతుంది. ఏకాగ్రత, దృష్టి పెరుగుతుంది.

3. సేతు బంధాసనం
దీన్ని బ్రిడ్జి పోజ్ అని కూడా పిలుస్తారు. టెస్టోస్టోరాన్ ఉత్పత్తికి మద్దతు ఇచ్చే కటి ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని సవ్యంగా జరిగేలా చేయడంలో ఈ యోగాసనం అద్భుతంగా పనిచేస్తుంది.

1. సేతు బందాసనం వేయడం కాస్త కష్టమే. దీనికోసం మీరు నేలపై వెల్లకిలా పడుకోవాలి.
2. పాదాలను నేలపై ఉంచి కాళ్ళను పైకి లేపాలి.
3. చేతులను నేలపై ఉంచాలి. శ్వాస తీసుకుంటూ నడుమును మాత్రం పైకి లేపాలి.
4. ఇది వంతెన ఆకారంలో కనిపిస్తుంది. భుజాలు, పాదాలు నేలపైనే ఉండాలి.
5. ఈ భంగిమలోనే కొంత సమయం పాటు ఉండి ఆ తర్వాత తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవాలి.

మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్నవారు మాత్రం ఈ ఆసనం వేయకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా యోగాసనం వేయడం మంచిది కాదు. మిగతావారు మాత్రం ఈ యోగాసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. నడుమునొప్పి చాలా వరకు తగ్గుతుంది.

4. బాలాసనం
ఈ ఆసనాన్ని చైల్డ్ పోజ్ పిలుస్తారు. వెన్నుముక, తొడలు, చీలమండలు సాగేలా చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మనసును ప్రశాంతంగా ఉంచేందుకు బాలాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది.
1. యోగ మ్యాట్ మీద మోకాళ్ళపై కూర్చోండి.
2. మీ పొట్టను తొడల మధ్యలో ఉంచి మీ నుదురుని నేలను తాకేలా ముందుకు వంచండి.
3. మీ చేతులను కాళ్ల పక్కనే ఉంచి అరచేతులను పైకి ఉండేలా చూడండి.
4. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలండి. ఇలా 8 సార్లు శ్వాస తీసుకుని వదిలే వరకు ఇదే భంగిమలో ఉండండి.

ఈ ఆసనం శరీరానికి విశ్రాంతిని ఇవ్వడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.

చివరికి చెప్పేదేంటంటే..
యోగా చేసే పురుషులు ఇతరులతో పోలిస్తే ఆరోగ్యంగా ఉంటారు. లైంగికంగా కూడా చక్కగా శక్తివంతంగా పెర్‌ఫార్మ్ చేయగలరు. లైంగికంగా తమను తాను శక్తివంతంగా మార్చుకోవాలనుకునే వారికి యోగా ఒక ప్రభావవంతమైన మార్గంగా చెప్పుకోవాలి. ఇక్కడ చెప్పిన యోగాసనాలన్నీ కూడా మగవారికి సులువైనవే. అయితే అధిక బరువుతో ఉన్నవారు మాత్రం ఇవి వేసేందుకు కష్టపడతారు. శరీరానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఈ యోగాసనాలు టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి ఈ యోగాసనాలను అప్పుడప్పుడు ప్రయత్నించండి.

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×