Indian Railways: ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కలిగించేందుకు ఎప్పటికప్పడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తమ ప్రయాణాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత ఆహ్లాదకరంగా కొనసాగించేలా కొత్త నియమాలు ఉపయోగపడనున్నాయి. అందులో భాగంగానే 2013 నాటి వెయిటింగ్ లిస్ట్ టికెట్ పరిమితులను రద్దు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ప్రతి కోచ్ లోని మొత్తం బెర్త్ సామర్థ్యంలో 25% వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు పరిమితం చేసే రూల్ ను ప్రవేశపెట్టనుంది. ఈ రూల్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణీకుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరచనుంది.
వెయిటింగ్ టికెట్లకు సంబంధించి నియమాలు
భారత రైల్వే 2013 మార్గదర్శకాల ప్రకారం, ఆయా తరగతులను బట్టి వెయిటింగ్ లిస్ట్ అందుబాటులో ఉంటుంది.
AC ఫస్ట్ క్లాస్: 30 టికెట్లు
AC 2-టైర్: 100 టికెట్లు
AC 3-టైర్: 300 టికెట్లు
స్లీపర్ క్లాస్: 400 టికెట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అయితే, ఈ నియమం తరచుగా ఓవర్ బుకింగ్, గందరగోళానికి దారితీసింది. ముఖ్యంగా పీక్ సీజన్లలో కన్ఫర్మ్ కాని ప్రయాణీకులు రిజర్వ్డ్ కోచ్‌లలో ఎక్కుతారు.
కొత్త వెయిటింగ్ టికెట్ రూల్స్ ఎలా ఉన్నాయంటే?
భారతీయ రైల్వే కొత్తగా ప్రతిపాదించిన రూల్స్ ప్రకారం, రిజర్వ్ చేయబడిన కోటాలను (సీనియర్ సిటిజన్లు, మహిళలు, వికలాంగులు) లెక్కించిన తర్వాత, ప్రతి కోచ్ లోని అందుబాటులో ఉన్న బెర్త్ లలో వెయిటింగ్ లిస్ట్ 25%కి పరిమితం చేయబడుతుంది. ఉదాహరణకు, స్లీపర్ కోచ్‌లో బుకింగ్ కోసం 400 బెర్త్ లు అందుబాటులో ఉంటే, గరిష్టంగా 100 వెయిటింగ్ లిస్ట్ టికెట్లు మాత్రమే జారీ చేయబడతాయి. ఈ నియమం స్లీపర్, AC 3-టైర్, AC 2-టైర్, AC ఫస్ట్ క్లాస్, చైర్ కార్ లాంటి అన్ని తరగతులకు వర్తిస్తుంది. తత్కాల్, రిమోట్ లొకేషన్ బుకింగ్‌లను కూడా కలిగి ఉంటుంది.
Read Also: హైదరాబాద్ మెట్రో క్రెడిట్ ఆ ముఖ్యమంత్రిదేనా? పునాది వేసింది ఎవరు?
కొత్త రూల్ తో కలిగే లాభాలు ఏంటి?
తాజా రూల్ ప్రకారం వెయిట్ లిస్ట్ చేసిన టికెట్లను కలిగి ఉన్న ప్రయాణీకులకు టెన్షన్ ను తగ్గిస్తుంది. రిజర్వ్ చేసిన కోచ్ లలో రద్దీని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా పండుగలు, సెలవు దినాలలో స్టేషన్లలో రద్దీని నియంత్రించడంలో అధికారులకు కొత్త నియమం సహాయపడుతుంది. 20–25% వెయిటింగ్ టికెట్లు సాధారణంగా తుది చార్ట్ తయారీకి ముందు ధృవీకరించబడినట్లు చూపించే డేటాతో కొత్త వెయిటింగ్ టికెట్ నియమం క్రమపద్ధతిలో అమలు చేయబడుతుంది. తాజా నియమం ప్రయాణీకులకు మరింత సౌకర్యాన్ని కలిగించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: ట్రైన్ మిస్ చేశారా? వెంటనే TDR ఫైల్ చెయ్యండి.. కొత్త రూల్స్ ఇవే!