BigTV English

Home Made Hair Pack: జుట్టు రాలుతోందా ? ఈ హెయిర్ ప్యాక్ ఒక్క సారి ట్రై చేసి చూడండి

Home Made Hair Pack: జుట్టు రాలుతోందా ? ఈ హెయిర్ ప్యాక్ ఒక్క సారి ట్రై చేసి చూడండి

Home Made Hair Pack: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. చిన్నా పెద్దా తేడా లేకుండా జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మారిన జీవన శైలి జుట్టు రాలడానికి ఓ కారణమైతే అనారోగ్య సమస్యలు కూడా మరో కారణంగా చెప్పవచ్చు.


శరీరానికి తగిన పోషకాలు అందకపోయినా కూడా జుట్టు రాలుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా హెయిర్ లాస్ సమస్యలతో ఇబ్బందిపడే వారు తగిన పోషకాహారం తినడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఏదీ ఏమైనప్పటికీ జుట్టు రాలడానికి ముందుగానే గుర్తించాలి. ఉసిరి, కొబ్బరి నూనెతో తయారు చేసిన హెయిర్ మాస్క్ ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మరి ఈ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అంతే కాకుండా ఉసిరిలో ఉండే కాల్షియం జుట్టుకు ఎండ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఉసిరిలో ఉండే విటమిన్ సి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొల్లాజిన్ ఉత్పత్తిలోనూ సహాయపడుతుంది. ఉసిరి పొడిని జుట్టుకు వాడటం వల్ల అద్భుత లాభాలు ఉంటాయి. దీని వల్ల తలపై ఉన్న వాపు తగ్గమే కాకుండా జుట్టు పెరుగుదల బాగుంటుంది.


కొబ్బరి నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ శరీరంలో జీవక్రియను పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కొబ్బరి నూనె జుట్టు పొడిబారడంతో పాటు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చికాకుగా ఉన్న స్కాల్ప్ కు మంచి రిలీఫ్‌ను కలిగిస్తుంది.

హెయిర్ మాస్క్ తయారీ :
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కాస్త 10 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని వేడి చేయాలి. ఆ తర్వాత అందులో 3- 4 టేబుల్ స్పూన్ల ఉసిరి కాయ పొడిని కలపాలి. ఆ తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకుని మిశ్రమం చల్లారిన తర్వాత తలకు అప్లై చేసుకోవాలి. దీనిని గంట పాటు ఉంచిన తర్వాత సున్నితమైన షాంపూతో కడిగేయండి.

Also Read: తలకు నూనె ఇలా పెట్టుకుంటే ఊడమన్నా.. ఊడదు !

ఈ విధంగా చేయడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో వాడిన కొబ్బరి నూనె , ఉసిరి పొడిల కాంబినేషన్ హెయిర్ కి మంచి పోషణను ఇస్తుంది. ఫలితంగా జుట్టు రాలకుండా ఉంటుంది. తరుచుగా ఈ హెయిర్ మాస్క్ వాడటం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా కొత్త జుట్టు రావడంతో పాటు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సంబంధిత సమస్యలకు అన్నింటినీ ఇది చాలా వరకు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×