BigTV English

Rishabh Pant: రిషబ్ పంత్ సాయం: వద్దన్న విద్యార్థి

Rishabh Pant: రిషబ్ పంత్ సాయం: వద్దన్న విద్యార్థి
Rishabh Pant helps Student for Engineering Fees: సామాజిక మాధ్యమాలు ఎంత దుర్మార్గంగా మారాయో తలచుకుంటే భయమేస్తోందని నెటిజన్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆర్థిక సాయం కోసం ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ ని అభ్యర్థించాడు. దీంతో తను కొంత మొత్తాన్ని పంపించాడు. ఇది చూసిన మధ్యలో కొందరు ఆ విద్యార్థిని మోసగాడు అంటూ ట్రోల్ చేశారు. దీంతో ఆ విద్యార్థి.. ఇంత విద్వేషాన్ని భరించలేను, ఆ డబ్బులు తిరిగి పంపించేస్తాను.. క్షమించండి అంటూ వేడుకున్నాడు. ఇప్పుడిది నెట్టింట వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. కార్తికేయ మౌర్య అనే విద్యార్థి తన ఎక్స్ ఖాతాలో కెట్టో లింక్ ను షేర్ చేసి, పంత్ సాయం కోరాడు. చండీగఢ్ విశ్వ విద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. పార్ట్ టైమ్ చేసుకుంటూ చదువుకుంటున్నాను. నాకు సరైన ఉద్యోగం లేక చదువు మధ్యలో ఆగిపోయింది. మీరు చేసే సాయంతో నా భవిష్యత్ కు మేలు కలుగుతుందని రాసుకొచ్చాడు.


దీనికి రిషబ్ పంత్ స్పందించి.. డబ్బులు పంపించాడు. అలాగే మీ కలలను నెరవేర్చుకోండి. ఎంత కష్టమైనా సరే, వాటిని చేరుకోండి.. అక్కడ దేవుడు మన కోసం మంచి ప్రణాళికలు సిద్ధం చేసే ఉంటాడు. అని రాసుకొచ్చాడు. ఇవన్నీ చూసిన కొందరు పనిగట్టుకుని ఆ కుర్రాడిని తిట్టడం మొదలుపెట్టారు. జాతీయ స్థాయి ఆటగాడిని మోసం చేశావంటూ ట్రోల్ చేశారు. ఇది చూసిన కుర్రాడు.. బాబోయ్ ఇంత విద్వేషాన్ని భరించలేను.. అవి తిరిగి పంపించేస్తాను. నన్ను క్షమించండి అంటూ రాసుకొచ్చాడు.

Also Read: దులీప్ ట్రోఫీ నుంచి ముగ్గురు అవుట్..!


నిజంగా ఇదెంతో బాధాతప్త హ్రదయంతో ఆ కుర్రాడు రాసినట్టుగా నెటిజన్లు పేర్కొంటున్నారు. నిజమో, అబద్ధమో పంత్ సాయం చేశాడు. అతను తీసుకున్నాడు. అది వారిద్దరి మధ్య వ్యవహారం. మీకెందుకు నోటి దురద, మీరేమీ రూపాయి ఇవ్వలేదు కదా.. ఆ కుర్రాడు ఎలాంటివాడో మీకు తెలీదు. ఒకవేళ నిజంగా చదువుకోవడానికే అయితే, ఆ కుర్రాడి భవిష్యత్తుని మీరే నాశనం చేసినట్టు.. అని కొందరు  అలా రాసినవారిని తిట్టిపోస్తున్నారు.

ఈలోకంలో నేడు పాప పుణ్యాలను విచారిస్తూ పోతే, ఏ ఓక్కరికి న్యాయం జరగదు. సాయం చేసేవారే కరవైపోతున్న ఈ రోజుల్లో పాపం పంత్.. ఏ మూడ్ లో ఉన్నాడో తెలీదు..సాయం చేశాడు. మీరు సలహా చెప్పాలంటే పంత్ కి చెప్పండి.. అంతేకానీ సహాయం అడిగి తీసుకున్న విద్యార్థిని ఆడిపోసుకోవడం మానవత్వం అనిపించుకోదని సైకాలజిస్టులు రాసుకొస్తున్నారు. దీనిని ఆటవిక నీతి అని కూడా అంటారని చెబుతున్నారు. సామాజిక మాద్యమాల్లో పోస్టింగులు పెట్టేవాళ్లు కొంత సంయమనం పాటించాలని రాసుకొస్తున్నారు.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×