BigTV English

Home Made Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై మొటిమలు మాయం

Home Made Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై మొటిమలు మాయం

Home Made Face Pack: ముఖం కాంతివంతంగా, మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో లభించే రకరకాల క్రీములు, ఫేస్‌వాష్‌‌లు వాడుతుంటారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ లో రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాల వల్ల చర్మానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖంపై ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా మెరిసిపోవాలంటే ఇంట్లోనే కొన్ని ఫేస్‌ప్యాక్‌లు తయారు చేసుకొని వాడడం మంచిదని అంటున్నారు. హోం మేడ్ ఫేస్ ప్యాక్‌ల వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్.


ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ఫ్యాక్‌లను రాత్రి పడుకునే ముందు ఫేస్‌పై అప్లై చేసుకుంటే.. ఉదయం ముఖం మిలమిలా మెరుస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఫేస్ ఫ్యాక్ ఎలా తయారుచేసుకోవాలి. వీటి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు..
పసుపు – ఒక స్పూన్
రోజ్ వాటర్ – 4 టేబుల్ స్పూన్లు
అలోవెరా జెల్ – అరకప్పు


పసుపు:
సాధారణంగా పసుపు చర్మ సంరక్షణకు ఎంత గానో ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది పసుపును వివిధ రకాల ఫేస్ ప్యాక్‌ల తయారీలో వాడుతుంటారు. ముఖ్యంగా పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఇది చర్మంపై మొటిమలు తగ్గించడంలో కూడా ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోవడంతో పాటు చర్మం ఎల్లప్పుడు యవ్వనంగా కనిపిస్తుంది.

అలోవెరా జెల్:
ఫేస్‌ప్యాక్‌ల్లో ఉపయోగించే అలోవెరా జెల్ చర్మానికి కావాల్సిన హైడ్రేషన్‌ను అందిస్తుంది. అంతే కాకుండా దీనిని అప్లై చేయడం వల్ల పొడి చర్మంపై ఏర్పడిన మొటిమలు కూడా తగ్గుతాయి. చర్మ సమస్యలు కూడా దూరం చేయడంలో ఇది ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా అలోవెరా స్కిన్ టోన్‌ను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. డార్క్ సర్కిల్స్‌నుఇది సమర్థవంతంగా తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖంపై మొటిమలు ఉన్నవారు ఎనిమిది వారాల పాటు రోజుకు రెండుసార్లు ముఖానికి అలోవెరా జెల్ అప్లై చేస్తే ముఖంపై ఉన్న మొటిమలు తగ్గడంతో పాటు ముఖం చాలా గ్లోయింగ్‌గా మారుతుంది. అంతేకాకుండా కొంత మంది ముఖంపై ఉండే ఎరుపు కూడా తగ్గుతుందని పరిశోధనలో వెల్లడైంది. అలోవెరా జెల్‌ను తరుచుగా ఫేస్‌పై అప్లై చేయడం వల్ల మొటిమలతో పాటు చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
రోజ్ వాటర్:
రోజ్ వాటర్ అనేది మంచి టోనర్. రోజ్ వాటర్ వాడడం వల్ల చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. ఎందుకంటే రోజ్ వాటర్‌లో యాంటీఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రాత్రిపూట ముఖానికి దీంతో ప్రిపేర్ చేసుకున్నా ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల చర్మంపై ఉన్న మలినాలు తొలగిపోతాయి. అంతేకాకుండా డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి.

ఫేస్‌ప్యాక్ తయారీ విధానం..
ఒక కప్పులో రెండు అరకప్పు అలోవెరా జెల్ తీసుకోవాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల రోజ్‌వాటర్‌ను ముందుగా తీసుకున్న జెల్ లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీనిని గాలి చొరబడని ఓ డబ్బాలో పెట్టు కొని నిల్వ ఉంచుకోవాలి. వారం రోజుల పాటు రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే చర్మంపై ఉన్న మచ్చలు, ముడతలు తొలగిపోవటంతో పాటు మీ ఫేస్ అందంగా మెరిసిపోతుంది.

 

Related News

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Big Stories

×