Blackheads: బ్లాక్ హెడ్స్ అనేది ఒక సాధారణ చర్మ సమస్య. ఇది ఎక్కువగా ముఖం, ముక్కు మీద వస్తుంది. చర్మ రంధ్రాలు.. చనిపోయిన చర్మ కణాలు సెబమ్ (నూనె)తో మూసుకుపోయినప్పుడు బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. ఇవి గాలికి గురైనప్పుడు నల్లగా కనిపిస్తాయి. బ్లాక్ హెడ్స్ కోసం అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ హెడ్స్ రావడానికి కారణాలు:
అదనపు నూనెల ఉత్పత్తి
చనిపోయిన చర్మ కణాలు
చర్మ రంధ్రాల విస్తరణ
హార్మోన్ల మార్పులు
కాలుష్యం
బ్లాక్ హెడ్స్ తగ్గించడానికి హోం రెమెడీస్:
అలోవెరా: కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ రంధ్రాలను క్లియర్ చేయడంతో పాటు చర్మంపై వచ్చే మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అలోవెరా జెల్ ను బ్లాక్ హెడ్స్ పై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా అనేది మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడే సహజమైన ఎక్స్‌ఫోలియంట్. నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి పేస్ట్ లా చేసి బ్లాక్ హెడ్స్ పై అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత కడగాలి.
వోట్మీల్: వోట్మీల్‌లో చర్మానికి ఉపశమనం కలిగించే గుణాలు ఉన్నాయి. ఓట్ మీల్‌ను నీళ్లలో కలిపి పేస్ట్ లా చేసి బ్లాక్ హెడ్స్‌పై అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత కడగాలి.
నిమ్మరసం: నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా ఉంచడంతో పాటు బ్లాక్ హెడ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. నీళ్లలో నిమ్మరసం మిక్స్ చేసి బ్లాక్ హెడ్స్ మీద అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత కడగాలి.
తేనె: తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ రంధ్రాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. బ్లాక్‌హెడ్స్‌పై తేనె రాసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
దాల్చినచెక్క: దాల్చినచెక్కలో క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి పేస్ట్‌లా చేసి బ్లాక్‌హెడ్స్‌పై అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత క వాష్ చేయాలి.
ఆపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్‌ని కలిగి ఉంటుంది. ఇది మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ని నీళ్లలో కలిపి బ్లాక్‌హెడ్స్‌పై అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత కడగాలి.
టమాటో: టమాటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. టమాటో గుజ్జును బ్లాక్‌హెడ్స్‌పై రాసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
బ్లాక్ హెడ్స్ రాకుండా ఉండాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి:
క్రమం తప్పకుండా ముఖం కడగాలి.
రాత్రిపూట మేకప్ తొలగించండి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
నీరు పుష్కలంగా త్రాగాలి.
ఒత్తిడిని తగ్గించుకోండి.
Also Read: ఈ ఆయిల్ వాడితే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
ఈ విషయాలు కూడా ముఖ్యమైనవి:
బ్లాక్‌హెడ్‌లను తొలగించడానికి బ్లాక్‌హెడ్ రిమూవల్ స్ట్రిప్స్ , ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్స్ వంటి అనేక రకాల సౌందర్య ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి మీ చర్మాన్ని ఎప్పుడూ గిల్లకండి. ఇది ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది.