E-Paper
Advertisement

Horoscope Today December 12th: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – కానీ ఆ విషయంలో జాగ్రత్త 

Horoscope Today December 12th: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – కానీ ఆ విషయంలో జాగ్రత్త 
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 12న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం ఉండదు. సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటా బయటా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కన్యరాశి : ఈ రాశి వారు ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడగలుగుతారు. దూరపు బంధువులను కలుసుకుని వివాహ విషయమై చర్చ చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌

 

తులా రాశి : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈరోజు శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఈరోజు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాల సంతృప్తినిస్తాయి.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఏర్పడతాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×