Cracked Heels: బిజీ లైఫ్ కారణంగా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు తరచుగా తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. ఎందుకంటే వారు ఇంటి , ఆఫీసు బాధ్యతలను బ్యాలెన్స్ చూస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అజాగ్రత్త కారణంగా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కానీ మహిళలు ఆరోగ్యంతో పాటు చర్మంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. మహిళలు తరచుగా చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అందులో పగిలిన మడమలు ఈ సమస్యలలో ఒకటి, దీని కారణంగా ప్రతిరోజు చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు.
చల్లని వాతావరణంలో మడమల పగుళ్ల సమస్య చాలా సాధారణం. అయితే మడమల పగుళ్లకు వాతావరణం మాత్రమే కాదు.. శరీరంలో పోషకాల లోపం, సోరియాసిస్, థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు కూడా కారణమవుతున్నాయి. ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారవచ్చు. ఈ సమస్యను అలాగే వదిలేస్తే.. తీవ్రమైన నొప్పితో పాటు రక్తస్రావం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి దీన్ని అధిగమించే పరిష్కారం మన వంటగదిలోనే ఉంది. అవును, వంటగదిలో ఉన్న కొన్ని పదార్థాల సహాయంతో దీనిని సులభంగా వదిలించుకోవచ్చు.
పాదాలకు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల, మడమల పగుళ్ల సమస్య ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇంట్లో తయారుచేసిన ఫుట్ క్రీమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఫుట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫుట్ క్రీమ్ :
కావలసినవి:
అలోవెరా జెల్- 2 స్పూన్లు
ఆవాల నూనె- ఒక చెంచా
కొబ్బరి నూనె- ఒక చెంచా
ఫుట్ క్రీమ్ ఎలా తయారు చేయాలి ?
ముందుగా కొవ్వొత్తిని తీసుకొని పీలర్ లేదా కట్టర్ సహాయంతో పీల్ చేయండి. దీని తరువాత, ఒక చెంచా కొవ్వొత్తి పొడిని తీసుకుని, దానిని వేడి చేయడానికి పాన్లో ఉంచండి.
ఇప్పుడు దానికి ఆవాల నూనె, కొబ్బరి నూనె , తాజా అలోవెరా జెల్ కలపండి. వీలైతే విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా కలుపుకోవచ్చు. తర్వాత వీటన్నింటినీ తక్కువ మంట మీద వేడి చేయండి. అది కరగడం ప్రారంభించినప్పుడు, 2 నిమిషాల తర్వాత గ్యాస్‌ను ఆపివేయండి. పగిలిన మడమల కోసం ఫుట్ క్రీమ్ సిద్ధంగా ఉంది. దీన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి. దీన్ని ఇలా ఉపయోగించండి.
ఇంట్లో తయారుచేసిన ఈ పాదాల క్రీమ్‌ను రాత్రి పడుకునే ముందు, ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పాదాలకు రాయండి. ఈ క్రీమ్ తో మీరు పగిలిన మడమలను వదిలించుకోవడమే కాకుండా, మీ పాదాల చర్మం యవ్వనంగా, మృదువుగా ఉంటుంది.
1. నిమ్మకాయ, గ్లిజరిన్, రోజ్ వాటర్:
గోరువెచ్చని నీటితో బకెట్ సగం నింపండి. ఇప్పుడు అందులో 3- 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక చెంచా గ్లిజరిన్ , ఒక చెంచా రోజ్ వాటర్ వేసి మీ పాదాలను 15-20 నిమిషాలు అందులో నానబెట్టండి. తర్వాత ఫుట్ స్క్రబ్బర్ తో హీల్స్ ను స్క్రబ్ చేయండి. దీని తర్వాత కూడా ఒక చెంచా గ్లిజరిన్, ఒక చెంచా రోజ్ వాటర్ , ఒక చెంచా నిమ్మరసం కలిపిన పేస్ట్ పాదాలకు పట్టించి సాక్స్‌లు ధరించాలి.దీనిని అలాగే రాత్రంతా వదిలేయండి. తర్వాత ఉదయం కాళ్లను శుభ్రం చేసుకోండి. దీనిని తరుచుగా వాడటం వల్ల కాళ్ల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. అంతే కాకుండా మృదువుగా మారతాయి.
2. తేనె:
ఒక చిన్న బకెట్ నీటిలో ఒక కప్పు తేనె కలపండి. అందులో మీ పాదాలను 15-20 నిమిషాలు నానబెట్టండి. తర్వాత మడమలను స్క్రబ్ చేయండి. స్క్రబ్ చేసిన తర్వాత, గోరువెచ్చని నీటితో పాదాలను వాష్ చేయండి. తరుచుగా ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే మీరే తేడా చూస్తారు.
3. కొబ్బరి నూనె:
పగిలిన మడమలను తరుచుగా కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. దీని తర్వాత సాక్స్ ధరించండి. ముఖ్యంగా రాత్రిపోట పగుళ్లు ఉన్న చోట కొబ్బరి నూనె వ్రాసి.. ఉదయం వాష్ చేసుకోండి. ఇది సులభమైన, ప్రభావవంతమైన చికిత్స అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల పగుళ్ల సమస్య చాలా వరకు తగ్గుతుంది.
Also Read: చలికాలంలో రాత్రి పూట బెల్లం పాలు త్రాగితే.. మతిపోయే లాభాలు
4. అలోవెరా :
గోరువెచ్చని నీటితో ఒక చిన్న బకెట్ నింపండి. మడమలను 5-10 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆపై వాటిని శుభ్రం చేసి ఆరబెట్టండి. ఇప్పుడు కాళ్లపై అలోవెరా జెల్ రాయండి. దీని తరువాత, సాక్స్ ధరించండి. రాత్రిపూట మడమల మీద కలబంద జెల్ రాసి రాత్రంగా వదిలేయండి. ఉదయం చల్లటి నీటితో వాస్ చేయండి.