BigTV English

Prasanth Varma: ప్రశాంత్‌ వర్మకు షాక్.. ప్రభాస్, బాలయ్య హ్యాండ్?

Prasanth Varma: ప్రశాంత్‌ వర్మకు షాక్.. ప్రభాస్, బాలయ్య హ్యాండ్?

Prasanth Varma: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి తెలిసిందే. వినూత్న కథనాలతో సూపర్ హీరో జానర్‌లో సినిమాలు చేయడంలో ప్రశాంత్ వర్మ దిట్ట. 2018లో “అ!” (Awe) సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక విభిన్న ప్రయత్నంగా గుర్తింపు పొందింది మరియు జాతీయ స్థాయిలో ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత, ప్రశాంత్ వర్మ తనదైన శైలిలో విభిన్న జానర్‌లలో సినిమాలను రూపొందించాడు. హనుమాన్‌ (Jai Hanuman)తో పాన్ ఇండియా హిట్ కొట్టి.. బాలయ్య (Balayya) కొడుకును లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ను విస్తరిస్తూ, రాబోయే సంవత్సరాల్లో సూపర్ హీరో చిత్రాలను రూపొందించే ప్రణాళికలో ఉన్నాడు. కానీ ఇప్పుడు వర్మ మళ్లీ మొదటికి వచ్చినట్టుగా సమచారం.


బాలయ్య, ప్రభాస్ హ్యాండ్ ఇచ్చినట్టే?

హనుమాన్ తర్వాత జై హనుమాన్ (Jai Hanuman) సీక్వెల్ ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. కానీ అనుకున్న సమయానికి ఈ సినిమా మొదలు పెట్టలేకపోయాడు. ఈ సినిమాలో కాంతార స్టార్ రిషబ్ శెట్టిని హనుమంతుడిగా రంగంలోకి దింపాడు. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఉండగానే.. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ (Mokshagna Teja)ను లాంచ్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇక పూజా కార్యక్రమాలు జరుపుకొని షూటింగ్‌కు వెళ్లడమే లేట్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా ఆగిపోయింది. అసలు ఈప్రాజెక్ట్ ఉందో లేదో తెలియకుండా పోయింది. అటకెక్కిన్నట్టుగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ఈలోపు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను లైన్‌లో పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. ఫోటో షూట్ కూడా జరిగిందని అన్నారు. కానీ ఇంకా దీని పై క్లారిటీ లేదు. ప్రభాస్ ఛాన్స్ ఇచ్చిన ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టం. ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు పూర్తి కావాలంటే.. రెండు మూడేళ్లు వెయిట్ చేయాల్సి ఉంది. కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పట్లో లేనట్టే. దీంతో.. మళ్లీ ప్రశాంత్ వర్మ మొదటికి వచ్చినట్టుగా సమాచారం. చివరికి హనుమాన్‌ సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’నే నమ్ముకున్నాడట. ప్రస్తుతానికి ఈ సినిమా పైనే ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాడట. కానీ ఇంకా కొన్ని సినిమలు లైన్‌లో పెట్టాడు ప్రశాంత్ వర్మ.


అ! నుంచి హనుమాన్ వరకు..!

“అ!” సినిమా ప్రశాంత్ వర్మ తొలి దర్శకత్వ చిత్రం. ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందింది. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా కసాండ్రా వంటి నటీమణులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కల్కి అంటూ.. రాజశేఖర్‌తో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేశాడు. 1980ల నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక గ్రామంలో జరిగే అన్యాయాలను ఎదుర్కొనే ఒక పోలీసు అధికారి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం మిశ్రమ స్పందనలను పొందింది. ఇక జాంబీ రెడ్డి తెలుగు సినిమాల్లో మొట్టమొదటి జాంబీ కామెడీ చిత్రంగా గుర్తింపు పొందింది. కరోనా మహమ్మారి సమయంలో ఈ సినిమా విడుదలైంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం వినోదాత్మకంగా ఉంటూ మంచి విజయాన్ని సాధించింది. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా వచ్చిన హను-మాన్ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో మొదటి సూపర్ హీరో చిత్రంగా రూపొందింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా హనుమంతుడి పౌరాణిక కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇప్పుడు జై హనుమాన్ చేస్తున్నాడు. ఇక అధీరా (Adhira), మహాకాళీ (Mahakali) సినిమాలు కూడా ప్రశాంత్ వర్మ లైన్‌లో ఉన్నాయి.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×