Eyebrows: మందపాటి, అందమైన కనుబొమ్మలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. కానీ కొంతమంది ఐబ్రోస్ పలుచగా ఉంటాయి. అయితే వీటిని సహజంగా పెంచుకోవడానికి కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. కనుబొబ్బలను పెంచుకోవడానికి మూడు హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని వాడటం వల్ల మందపాటి, ఆకర్షణీయమైన కనుబొమ్మలు మీ సొంతం అవుతాయి. మరి ఏ టిప్స్ పాటిస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె ఉపయోగించడం:
కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలతో పాటు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా హెయిర్ ఫోలికల్స్ కు కూడా పోషణనిస్తుంది. జుట్టు మూలాలకు బలాన్ని అందిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటి బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కనుబొమ్మల చుట్టూ ఉన్న చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఎలా వాడాలి ?
ముందుగా ఒక గిన్నెలో కాస్త కొబ్బరి నూనె తీసుకుని అందులో కాటన్ కాటన్ ముంచి కనుబొమ్మలపై అప్లై చేయండి. తర్వాత 2- 3 నిమిషాల పాటు మసాజ్ చేయండి. తద్వారా ఈ ఈ ఆయిల్ చర్మంలోకి వెళ్తుంది. ఇలా రోజు చేయడం వల్ల కొన్ని వారాల్లోనే మీకు తేడా తప్పకుండా కనిపిస్తుంది.
2. ఆముదం:
ఆముదాన్ని శతాబ్దాలుగా జుట్టు పెరగడానికి వాడతారు. కనుబొమ్మలు సహజంగానే బలంగా మారాలంటే ఆముదం వాడాలి. ఇది కనుబొమ్మలు పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది.
ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా జుట్టు పగుళ్లను కూడా నివారిస్తుంది. బలంగా కూడా చేస్తుంది. ఇది స్కాల్ప్ తో పాటు చర్మాన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది. తద్వారా జుట్టు మూలాలకు కూడా పోషణనిస్తుంది.
ఎలా వాడాలి ?
కాస్త ఆముదాన్ని తీసుకుని అందులో కాటన్ ముంచి సున్నితంగా కనుబొమ్మలపై మసాజ్ చేయండి. తర్వాత 30- 40 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీళ్లతో ఫేస్ వాష్ చేయండి. వారానికి 3- 4 సార్లు వీటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read: ఇవి వాడితే.. జుట్టు జన్మలో రాలదు
3. అలోవెరా జెల్:
కలబందలో సహజ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కనుబొమ్మలు మందంగా ఆరోగ్యంగా మార్చేందుకు కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ లో ఉండే విటమిన్ ఎ, సి , ఇ జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా కలబంద కూడా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చికాకును కూడా తగ్గిస్తుంది. జుట్టు మూలాలకు పోషణనివ్వడంలో అలోవెరా చాలా బాగా పనిచేస్తుంది.
ఎలా వాడాలి ?
కలబంద జెల్ 1 టీ స్పూన్ తీసకుని దీనిని కనుబొమ్మలపై అప్లై చేయండి. 20- 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో కడిగేయండి. తరుచుగా దీనిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కలబంద జెల్ ఐబ్రోస్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మందంగా , ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.