E-Paper
Advertisement

Hyderabad Drinking Water: HYDలో 24 గంటలు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్.. మీ ఏరియా ఉందా..?

Hyderabad Drinking Water: HYDలో 24 గంటలు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్.. మీ ఏరియా ఉందా..?
Advertisement

Hyderabad Drinking Water: హైదరాబాద్ మహా నగరంలో ప్రజలు ఓ గంట సేపు తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడితే.. ఎంత సమస్య వచ్చి పడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ మహానగరంలో ఉన్నవారికి అయితే ఈ సమస్య గురించి మరింత ఎక్కువగా తెలుస్తోంది.

అయితే.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) కీలక ప్రకటన చేసింది. కొన్ని కారణాల వల్ల జనవరి 11(ఈ శనివారం)న ఉదయం 6 గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేయబడుతోందని పేర్కొంది. దాదాపు 24 గంటల పాటు ఈ నీటి సరఫరా అంతరాయం ఉండనుందని పేర్కొంది. ఈ 24 గంటల సమయంలో హియాయత్ సాగర్ రిజర్వాయర్ ఫోర్బే, మిరాలమ్ ఫిల్టర్ బెడ్స్, సెట్లింగ్ ట్యాంక్స్ అలాగే ఇన్‌లెట్ ఛానెల్స్‌ను శుభ్రపరిచే పనులు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ కారుణంగానే పలు ప్రారంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని చెప్పింది.

Advertisement

ఈ పనుల కొనసాగడం వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్ల పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. జనవరి 11 (శనివారం) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఆదివారం 6 గంటల వరకు పారిశుద్ధ్య పనులు జరుగుతాయని చెప్పింది. నగరవాసులందరూ తమకు సహకరించాలని కోరింది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్, కిషన్ బాగ్, దూబ్ బౌలి, మిస్రిగంజ్, పత్తెర్‌గట్టి, దర్-ఉల్-షిఫా, మోఘల్పురా, జహనుమ, చందులాల్ బరాదరి, ఫలక్‌నుమా, జంగంపేట్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడునుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఉండేవారు నీటిని పొదుపుగా వాడుకోవాలని HMWSSB సూచించింది.

Also Read: AIIMS Recruitment: గోల్డెన్ ఛాన్స్.. టెన్త్ క్లాస్ అర్హతతో 4597 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.70,000

Advertisement

అయితే.. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే సమస్యకు పరిష్కారం చూపి.. తాగునీరు సరఫరా జరిగే విధంగా చూడాలని స్థానికులు అధికారులను, రాజకీయ నాయకులను కోరుతున్నారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×