BigTV English

Japan Work Life : జపాన్ ‘పని’ మరణాల హిస్టరీ మీకు తెలుసా? ‘కరోషి’ కల్చర్‌కు నేటితరం గుడ్‌బై!

Japan Work Life : జపాన్ ‘పని’ మరణాల హిస్టరీ మీకు తెలుసా? ‘కరోషి’ కల్చర్‌కు నేటితరం గుడ్‌బై!

Japan Work Life : పని చేసే సామర్థ్యమున్న యువత ఎంత ఎక్కువగా ఉంటే ఆయా దేశాలకు అంత ప్రయోజనం. అన్ని రంగాల్లోనూ సమృద్ధిగా కార్మిక శక్తి ఉంటే.. ఆయా దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటాయి. ఇదే ఫార్ములాను అనుసరించి.. వేగవమంతమైన వృద్ధిని సాధించింది జపాన్. కష్టపడి పనిచేయడం, ఎంచుకున్న రంగాల్లో రాణించడం.. ఇదే ఆ దేశస్థులకు తెలిసిన విధానం. ఏదైనా రంగంలో ప్రవేశించామా.. అందులో కష్టపడి పని చేశామా లేదా అన్నదే అక్కడ ప్రాధాన్యాంశం. కానీ.. రానురాను ఇక్కడ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు వస్తున్నాయి అంటున్నారు పరిశోధకులు. ప్రస్తుత యువతరం..  జపాన్ లోని పని విధానంపై నిరాసక్తతతో ఉన్నారని, అధిక పని గంటల్ని నిరసిస్తున్నారని అంటున్నారు. అందుకు.. కారణాలేంటంటే..


అంతర్జాతీయంగా అత్యధిక పని గంటలున్న దేశాల్లో ఉత్తర కొరియా, జపాన్ దేశాలు ముందు వరుసలో ఉంటాయి. ఇక్కడ సగటున వారానికి 46 పని గంటలు ఉంటాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే.. ఇది చాలా ఎక్కువ అంటున్నారు విశ్లేషకులు. ఈ స్థాయిలో నిరంతరం పని చేయడం కారణంగా.. అక్కడ ఉద్యోగుల్లో చాలా మంది పనిలో ఉండగానే మరణిస్తుంటారు. అక్కడ.. సంస్థలు అమలు చేయాల్సిన పని గంటలపై ప్రభుత్వ ఆంక్షలు లేకపోవడంతో సంస్థలు ఒక్కోరకంగా ఉద్యోగులతో పనులు చేయించుకుంటాయి. చాాలా సంస్థలు డబ్బులు చెల్లించకుండానే ఓవర్ టైమ్ పనిచేయించుకుంటాయి కూడా.

ఈ విధానంతో తీవ్ర పని ఒత్తిడి, సుదీర్ఘ సమయం విరామం లేకుండా పని చేయడం, ఇతర కారణాలతో చాలా మంది కార్మికుల ఆరోగ్యం తీవ్రంగా పాడైపోతుంది. చాలా సందర్భాల్లో ఇది మరణాలకూ దారితీస్తోందని చెబుతున్నారు. అధిక పని ఒత్తిడి కారణంగా చనిపోవడాన్ని చెప్పడానికి జపాన్ లో ప్రత్యేక పదమే ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాన్నే ‘కరోషి’ అంటారు. అంటే.. పని ఒత్తిడి కారణంగా గుండెపోటు, పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యలుతో చనిపోవడం లేదా ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాల్లో ఈ పదం వినియోగిస్తారు.


అధిక పని గంటల కారణంగా.. లావుగా తయారవ్వడం సహా గుండె సంబంధిత వ్యాధులు, గుండె పోటు ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. మధుమేహం వంటి వ్యాధులు పెరుగుతాయని, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని పరిశోధకులు తెలుపుతున్నారు. అధిక ఒత్తిడి, పనిలో నాణ్యత కొరవడడం, అవసరమైన విశ్రాంతి లేకపోవడం వల్ల మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆత్మహత్యలు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జపాన్‌లో 1,456 కరోషి కేసులు నమోదైనట్లు ప్రభుత్వ రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ.. వాస్తవంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అక్కడి కార్మిక వర్గాలు, సంఘాలు చెబుతున్నాయి.

మార్పు మొదలైంది…
తరాలుగా ఇలాంటి పని సంస్కృతి అమలవుతున్న జపాన్ లో క్రమంగా తీవ్ర మార్పులు కనిపిస్తున్నట్లు అక్కడి పరిశోధకులు గుర్తించారు. ఇక్కడి పని సంస్కృతి, కఠినమైన పని వాతావరణం.. స్వీయ త్యాగానికి పర్యాయపదంగా ఉండగా.. ఇప్పుడొక నిశ్శబ్ద విప్లవం మొదలైందని చెబుతున్నారు. ఇప్పుడు యువ జపనీస్ కార్మికులు వాళ్ల తాతలు, తండ్రుల మాదిరి ఎక్కువ పని గంటలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. ఫలితంగా కరోషి మరణాలు తగ్గుముఖ్యం పట్టాయని అంటున్నారు.

ఇటీవలి జపాన్‌లో వార్షిక పని గంటలు 11.6 శాతం తగ్గాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2000లో 1,839 గంటల వార్షిక పని గంటలు ఉంటుండగా, 2022లో 1,626 గంటలకు పడిపోయినట్లు గుర్తించామని.. రిక్రూట్ వర్క్స్ ఇన్‌స్టిట్యూట్‌ లోని విశ్లేషకుడు తకాషి సకామోటో తెలిపారు. ఇది.. అనేక యూరోపియన్ దేశాల నగటు పని గంటలతో సమానమని అంటున్నారు.

Also Read : ఆసియా మ్యాప్‌లో కొత్త దేశం.. అదే జరిగితే ఇండియాకు లాభమా, నష్టమా?

ఒక కంపెనీ కోసం తమను తాము త్యాగం చేసుకోవడం సరైన విధానం కాదని జపాన్ యువత భావిస్తోంది. వారు అదే విధంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్థిక వృద్ధిస ఉద్యోగ భద్రతతో సంబంధం లేకుండా ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి పనిచేసిన తమ పెద్దవారికి భిన్నంగా పని చేసేందుకు జపాన్ యువత ప్రయత్నిస్తోందని అంటున్నారు. అలాగే.. వారు పని – జీవిత సమతుల్యతకు ప్రాధాన్యతనిస్తున్నారని అంటున్నారు. జీవితం అంటే పని మాత్రమే కాదని.. వ్యక్తిగత జీవితానికీ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×